Moral story for life: మన పూర్వీకులు కొందరు చెప్పినా మాటలను ఇప్పటివారు పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ కాలంలో పెద్దలు ఒక మంచి పని కోసమే మంచి మాటలు చెప్పేవారు. ముఖ్యంగా చాలా విషయాల్లో వారు ఏం జరిగినా అంతా మనమంచికే అని అంటూ ఉంటారు. అంటే ఒక్కోసారి చెడు జరిగినా కూడా అది మన మంచికే జరిగిందని అనుకోవాలని అంటుంటారు. కానీ ఇలాంటి సందర్భంలో చాలామందికి కోపం వస్తుంది. అలాగే ఒకప్పుడు ఒక రాజుకు కూడా ఇలాగే కోపం వచ్చింది. కానీ రాజుకు కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా? అసలు ఏం జరిగినా అంతా మనమంచికే అని పెద్దలు ఎందుకు అంటారు? ఇక్కడ రాజుకు మంచే జరిగిందా? లేక చెడు జరిగిందా? ఈ నీతి కథ ద్వారా తెలుసుకుందాం.
పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. అతడు ఎప్పుడూ తన ప్రజల బాగోగులను చూస్తూ సంతోషంగా ఉండేవారు. అయితే ఒకరోజు రాజు సభ మధ్యలో నడుస్తుండగా తన కత్తి జారిపడి కాలు మీద పడుతుంది. దీంతో రాజు కాలివేలు తెగిపోతాయి. అయితే దీనిని చూసినా మంత్రి.. రాజుగారు ఏం జరిగినా అంతా మనమంచికే.. అని అంటాడు. దీంతో రాజుకు కోపం వచ్చి మంత్రిని చెరసాలలో బంధిస్తాడు. అయితే ఆ తర్వాత రాజు ఒకసారి వేరే రాజ్యానికి వెళ్తాడు. ఈ సమయంలో కొందరు అటవీకులు రాజులు బంధిస్తారు. నరబలి ఇచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇంతలో రాజుకు తెగిపోయిన వేళ్ళను చూస్తారు. ఇది చూసిన వారి పెద్ద రాజు నరబలికి పనికిరాడు అని విడిచిపెడతారు. దీంతో రాజు అక్కడి నుంచి తన రాజ్యానికి వస్తాడు.
అయితే అనవసరంగా మంత్రిని చెరసాలలో బంధించాలని పశ్చాత్తాప పడుతూ అతడిని విడిచిపెడతాడు. ఈ సమయంలో రాజు మంత్రిని అడుగుతాడు.. అసలు మీరు ఏం జరిగినా అంతా మన మంచికే అని ఎందుకు అన్నారు? అని అడుగుతాడు. అప్పుడు మంత్రి మాట్లాడుతూ.. రాజుగారు మీకు కాలివేలు తెగిపోకపోతే మిమ్మల్ని నరబలి ఇచ్చేవారు. ఒకవేళ నన్ను చెరసాలలో బంధించకపోతే మిమ్మల్ని విడిచిపెట్టి నన్ను చంపేసేవారు. పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో అంతా మంచే జరిగిందని.. అందువల్ల ఏం జరిగినా మన మంచికే అని అనుకుంటే.. అన్ని చక్కబడతాయి అని అంటాడు.
మానవ జీవితంలో కూడా ఇదే నీతి వర్తిస్తుందని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. చిన్నచిన్న కష్టాలు ఎదురు కాగానే తమ జీవితం ఏదో అయిపోయిందని బాధపడుతూ ఉంటారు.. వాస్తవానికి ఒక వ్యక్తికి పెద్ద కష్టం రాకుండా ఉండడానికి చిన్న చిన్న కష్టాలు వస్తుంటాయి. వీటి అనుభవంతో వారు తమ జీవితాన్ని చక్కపెట్టుకుంటారు. అందువల్ల ఎలాంటి ఎదురుదెబ్బలు తగిలినా.. ఎలాంటి నష్టం జరిగినా.. అంతా మన మంచికే అని అనుకోవాలి.