GST: చీకటిని చూస్తే తిట్టుకునే కంటే ఆ చీకటిలో చిరు దీపం వెలిగించడం మంచిది చైనా సామెత. మనకు ప్రభుత్వాన్ని తిట్టడం ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నింటికి ప్రభుత్వాలను నిందించి మన కోపాన్ని ప్రదర్శిస్తుంటాం. కానీ అది మంచిది కాదు. మనం కూడా ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండే మార్గాలను వెతకడం ఉత్తమం. ఇటీవల కాలంలో జీఎస్టీ పడుతోందని మనమందరం గగ్గోలు పెడుతున్నాం. కానీ మనం చేసే తప్పులు మాత్రం యథావిధిగా చేస్తున్నాం.

తెల్లవారింది మొదలు పాల ప్యాకెట్ నుంచి అన్ని అవసరాలు షాపింగ్ మాల్స్ తోనే తీర్చుకుంటున్నాం. దీంతో జీఎస్టీ మనకు తెలియకుండానే కడుతున్నాం. ఇక్కడే కొద్దిగా బుద్ధిని ఉపయోగిస్తే మనకు జీఎస్టీ భారం ఉండదు. కూరగాయలు, వంటకు సంబంధించిన వస్తువులు చిన్నకిరాణా దుకాణాల్లో కొనుగోలు చేయండి. దీంతో జీఎస్టీ భారం ఉండదు. బయటకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ ఇంటి నుంచే తీసుకెళ్లండి. హోటళ్లలో తినుబండారాలు తినకండి. ఇంటి నుంచే టిఫిన్ తీసుకెళ్లండి వృథా ఖర్చులు తగ్గించుకోండి.
Also Read: AP Govt On Debts: ఏపీ అప్పుల కుప్పపై షాకింగ్ లెక్కలు బయటపెట్టిన కేంద్రం
పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు కాకుండా చుట్టుపక్కల గేదె పాలను కొనుక్కోండి. తద్వారా వ్యాధులకు దూరంగా ఉండండి. ఇక ప్యాక్ చేసిన తృణ ధాన్యాలు తీసుకోకండి. బయట చిన్న దుకాణాల్లో ఉన్న వాటిని కొనుగోలు చేస్తే మనపై ఎలాంటి భారం పడదు. దీంతో చిన్న వ్యాపారులకు ఊరట లభించనట్లు అవుతుంది. వారి వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. తద్వారా చిన్న వ్యాపారాలను ప్రోత్సహించిన వారమవుతాం. అంతేకాని షాపింగ్ మాల్స్ కు వెళ్లి దర్జాగా కొనుగోలు చేసే వాటిలో జీఎస్టీ మనపై పడుతుందని తెలుసుకోవచ్చు.

ఇక వినోదం కోసం అయితే దుబారా ఎక్కువగా చేస్తుంటాం. ఐమాక్స్ థియేటర్లకు వెళ్లి రూ. వందలు ఖర్చు పెట్టి సినిమాలు చూస్తాం. కానీ దీనికి విరామం ఇవ్వండి. సింగిల్ స్క్ర్రీన్ థియేటర్ కు వెళ్లి ప్రశాంతంగా తక్కువ ధరలో సినిమా చూసి వినోదం పొందవచ్చు. తినుబండారాలు కూడా మాల్స్ నుంచి తెచ్చుకోవడం మానేయండి. ఇంటిలో చేసుకుంటే పరిశుభ్రత తోపాటు ఆరోగ్యం మన సొంతమే. దీంతో జీఎస్టీ భారం నుంచి తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిని అనుసరించి మన జీవితం కూడా బాగుండాలని కోరుకోవడంలో తప్పులేదు.