https://oktelugu.com/

Conjunctivitis: కళ్ల కలక ఉన్నవారిని చూస్తే మనకూ వస్తుందా? నిజమెంత?

కళ్ల కలక వచ్చిన వారి కంట్లో చూడగానే ఇతరులకు సోకుతుందని అనేది అబద్ధం. ఇది బ్యాక్టీరియా. దీంతో కళ్ల కలక వచ్చిన వారు వాడిన వస్తువులను తాకిన వారికి మాత్రమే ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 2, 2023 / 04:24 PM IST

    Conjunctivitis

    Follow us on

    Conjunctivitis: తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా కళ్ల కలక (కంజెక్టివైటీస్)కేసులు పెరుగుతున్నాయి. ఒక శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతోనే ఇది వస్తుందని కొందరు వైద్యులు పేర్కొంటున్నారు. అయితే కళ్ల కలక రాగానే చాలా మంది ఇంటి చిట్కాలతో సరిపెట్టుకుంటున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదిస్తేనే మంచిదంటున్నారు. అయితే కళ్ల కలక వచ్చిన వారు ఎక్కువ శాతం కంటి దగ్గర చేతులు పెట్టడం.. ఆ చేతితో ఇతర వస్తువులను తాకడంతో ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది. అందువల్ల కళ్ల కలక వచ్చిన వారి ప్రైవేట్ వస్తువులను చాలా వరకు దూరంగా ఉంచితేనే మంచిదని అంటున్నారు. అయితే ఎక్కువ శాతం కళ్ల కలక వచ్చిన వారి కళ్లలోకి చూడడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుందా? అనే అనుమానం చాలా మందిలో కలుగుతోంది. ఇది నిజమేనా?

    ఒక కన్ను ఎర్రబడడం లేదా.. రెండు కళ్లు ఎర్రగా మారడం.. కళ్లలో మంట నొప్పి లేక దురద .. కనెరెప్పలు వాపు రావడం, కంటి రెప్పలు అతుక్కోవడం.. ఎక్కువగా వెలుగులు చూడలేకపోతవడం లాంటి లక్షణాలు ఉంటే కళ్లకలక అని అర్థం. ఇలాంటి లక్షణాలు కనిపించిప్పుడు కళ్లను నలపడం లేదా కంట్లో చేతులు పెట్టడం కానీ చేయకూడదు. శుభ్రమైన కర్చీప్ లేదా టిష్యూ పేపర్ తో కళ్లను తుడుచుకోవాలి. నల్లటి అద్దాలు పెట్టుకోవడం ద్వారా లక్షణాల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. ఈ వైరస్ ఒకటి, రెండు వారాల్లో తగ్గిపోతుంది.

    ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సోకకుండా ఉండడానికి చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. తరుచూ కళ్లను ముట్టుకోవడం మానేయాలి. ఈ సమస్య ఉన్నప్పుడు జనంలో తిరకుండా ఉండాలి. కళ్ల కలక ఉన్నవారు వాడిన కర్చీఫ్, లేదా చెద్దర్లు ఇతరులు వాడకుండా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ లక్షణాలు కనిపించినప్పుడు స్కూల్ కు పంపకుండా ఉండడమే మంచిది. సొంత వైద్యంతో ఆలస్యం చేయకుండా వైద్యడు వద్దకు వెళ్లి సలహా తీసుకోవడం మంచింది.

    కళ్ల కలక వచ్చిన వారి కంట్లో చూడగానే ఇతరులకు సోకుతుందని అనేది అబద్ధం. ఇది బ్యాక్టీరియా. దీంతో కళ్ల కలక వచ్చిన వారు వాడిన వస్తువులను తాకిన వారికి మాత్రమే ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందువల్ల కళ్లలోకి చూడడం ద్వారా వస్తుందనేది ఏమాత్రం నిజం కాదని అంటున్నారు. అయితే ముందు జాగ్రత్తగా కళ్లకలక వచ్చిన వారు గ్లాసెస్ పెట్టుకోవడం ద్వారా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెబుతున్నారు.