https://oktelugu.com/

Prabhas : ప్రభాస్ ఇంత ఏజ్ వచ్చిన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే..?

ప్రభాస్ లాంటి నటుడు తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకున్న ఏకైక నటుడి గా కూడా ఆయన పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 25, 2024 / 09:01 AM IST

    What is the reason for Prabhas not getting married at this age?

    Follow us on

    Prabhas : ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్ వర్షం సినిమాతో మొదటి సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ఛత్రపతి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కానప్పటికి ప్రభాస్ క్రేజ్ మాత్రం భారీగా పెరిగింది. ఇక ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటూ ముందుకు సాగుతున్నప్పటికి ఆయనకు వరుసగా కొద్ది సంవత్సరాల పాటు ఫ్లాప్ లైతే వచ్చాయి. ఇక ఆ తర్వాత డార్లింగ్, బుజ్జి గాడు, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక రాజమౌళి తో ఆయన చేసిన బాహుబలి సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో సూపర్ స్టార్ గా ఎదిగిపోయిన ప్రభాస్ ప్రస్తుతం భారీ ఎత్తున సినిమాలను చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

    ఇక ఇప్పటికే పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరో కొనసాగుతున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ 45 సంవత్సరాలు వయసు వచ్చిన కూడా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏంటి అంటూ చాలామంది ప్రభాస్ మీద కొన్ని విమర్శలైతే చేస్తున్నారు.

    నిజానికి ఆయన లాంటి నటుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వాళ్ళని కూడా సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాల్సిన బాధ్యత అయితే ఉంది. కానీ ఆయన మాత్రం పెళ్లి ప్రస్తావన తీసుకురావడం లేదు. ఇప్పటికే చాలామంది హీరోలు పెళ్లి చేసుకోవడమే కాకుండా మరో రెండు మూడు సంవత్సరాలైతే వాళ్ల వారసులను కూడా సినిమా ఇండస్ట్రీలోకి దింపుదామనే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోవడం పట్ల ఆయన అభిమానులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులుగాని విపరీతమైన ఆందోళన చెందుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు సినిమాల మీద పెట్టినంత దృష్టి తన పెళ్లి మీద పెట్టడం లేదు. మరి తనకు పెళ్లంటే ఎందుకు అంత విరక్తి పుట్టింది.

    తను కెరియర్ లో ఇక పెళ్లి చేసుకోడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో పెళ్లి చేసుకొని సినిమాల్లో నటిస్తే బాగుంటుందని తన అభిమానులు కూడా కోరుకుంటున్నారు… చూడాలి మరి ఫ్యూచర్ లో ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది…