Difference Between Suit And Blazer : ప్రపంచంలో అందంగా కనిపించాలన్న ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో రోజు రోజుకు పెరుగుతుంది. ఎంతో మంది ప్యాషన్ డిజైనర్‌ల నుంచి సూట్, బ్లేజర్, కోటు వంటి ఫ్యాషన్ ఐటెమ్స్‌ను ఇష్టపడుతున్నారు. ఇవి వ్యక్తుల రూపాన్ని మెరుగుపరిచే ప్రతిష్టాత్మక వస్త్రాలుగా మారాయి. అయితే, ఇవి ప్రతి సందర్భానికి సరిపోవడం లేదు. సూట్‌లు ఎక్కువగా ఫార్మల్ సందర్భాల్లో, బ్లేజర్‌లు జస్ట్ క్యాజువల్ లుక్ కోసం, కోటులు రక్షణనూ అందిస్తాయి. ప్రతీ దాని వెనుక కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, అవి వ్యక్తిగత శైలి, ఆహ్లాదం, వినోదం కోసం సరైన బట్టలను ఎన్నుకోవడానికి సాయం చేస్తాయి
ప్రపంచ ఫ్యాషన్ డిజైన్‌లో ఇవన్నీ ప్రత్యేక సందర్భాలలో అందరినీ ఆకర్షించే ప్రత్యేక దుస్తులు. సూట్, కోట్, బ్లేజర్ మూడు వేర్వేరు వర్గాలు.. అయితే అవి సాధారణంగా కొంత గందరగోళాన్ని కలిగిస్తుంటాయి. అవి సరిగ్గా ఎక్కడ, ఎలా ధరించాలి అనే విషయం చాలా మందికి క్లియర్ గా తెలియకపోవచ్చుచ. ఈ మూడు దుస్తుల మధ్య ఉన్న తేడాలను తెలుసుకోవడం, ప్రత్యేక సందర్భాల్లో సరైన ఆలోచన తీసుకోవడంలో సహాయపడుతుంది.
కోటు: కోట్ అనేది సూట్‌లో భాగం. ఇది సాధారణంగా అధికారిక సందర్భాల్లో ధరిస్తారు. ముఖ్యంగా ఆఫీస్ మీటింగ్స్ లేదా ఫంక్షన్స్‌లో దీనిని ధరిస్తారు. కోటు సాధారణంగా ముదురు రంగులో ఉంటుంది . టెర్రీకాట్ లేదా ఉన్ని వంటి బట్టలతో తయారవుతుంది. కోట్ అనేది ఒక పూర్తి సూట్‌లో భాగంగా మాత్రమే కనిపిస్తుంది.
సూట్: ఇది సాధారణంగా ఒక ఫార్మల్ డ్రెస్ కోడ్‌లో భాగంగా వాడుతుంటారు. సూట్‌లోని కోట్‌ను వ్యక్తి శరీరానికి సరిపోయేలా తయారుచేస్తారు, ఇది సాధారణంగా ఒకే రకమైన బట్టతో ఉంటుంది.
సూట్ అనేది రెండు లేదా మూడు ముక్కలు కలిపి తయారు చేస్తారు. ఇది సాధారణంగా ప్యారెటిక్యులర్ సందర్భాలలో ధరించబడుతుంది. ప్రస్తుతం సూట్‌లలో వివిధ డిజైన్లు, స్టైల్ లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇవి మరింత ట్రెండీగా మారాయి.
బ్లేజర్: బ్లేజర్‌లను మీరు ఫార్మల్ లేదా క్యాజువల్ సందర్భాల్లో ధరించవచ్చు. వీటి ప్రధాన విశేషం ఏమిటంటే ఇవి మ్యాచింగ్ ప్యాంటుతో అందుబాటులో ఉంటాయి. ప్యాంటులు జీన్స్, చినోస్, కాటన్‌తో కూడా బ్లేజర్‌ను మ్యాచ్ చేసుకోవచ్చు. బ్లేజర్‌లు సాధారణంగా లినెన్, కాటన్ లేదా కౌడ్రాతో తయారవుతాయి. అలా అయితే, ఇవి సూట్ లేదా కోటు కంటే మరింత డైనమిక్‌గా ఉంటాయి. ఫ్రెండ్లీ , ఎక్కడైనా ధరించడానికి అనువుగా ఉంటాయి.
ఫ్యాషన్ అవగాహన: ప్రస్తుతం అన్ని వయస్సుల పురుషులు సూట్లు, కోట్లు లేదా బ్లేజర్లు ధరించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇవి వారి వ్యక్తిత్వానికి సరిపడా స్టైల్ ఆకర్షణను జోడిస్తాయి. అయితే, ప్రతి సందర్భంలో సరైన బట్టను ఎంచుకోవడం అవసరం. సూట్, కోట్, బ్లేజర్ తేడాలను అర్థం చేసుకోవడం వాటిని సరైన సమయంలో ధరించడం, ప్రత్యేకమైన రీతిలో కూర్చోవడం ప్రతి వ్యక్తి స్టైల్, పద్ధతిని పెంపొందిస్తుంది.