Love and Romance “ప్రేమ అనేది 2 హృదయాలకు సంబంధించింది.. సెక్స్ అనేది 2 జననాంగాలకు సంబంధించింది..” అని ఓ బుక్ లో చదివాను. ఆ రచయిత.. ఇవి రెండు వేర్వేరు అంశాలని చెబుతున్నాడు. నేను అంగీకరించలేదు. అందుకే ఈ పోస్టు. చాలా మందికి అవును కదా.. ఆ రచయిత చెప్పింది నిజమే కదా అనిపిస్తుంది. కానీ.. నా యాంగిల్ ఏమంటే.. మనిషి ఏ పని చేయాలన్నా మూలం మెదడు. అది Director. బాడీ పార్ట్స్ అన్నీ జస్ట్ Actors. మైండ్ Guide చేయకపోతే శరీర అవయవాలన్నీ వట్టి కట్టెముక్కలు. సెక్స్ కూడా దీనికి మినహాయింపు కాదు. అపోజిట్ జెండర్ తో Mating కోసం కేవలం 2 జననాంగాలు సిద్ధంగా ఉంటే సరిపోదు. మనసులో కోరిక కలగాలి. అప్పుడే మగాడిలో Erection ప్రాసెస్ జరుగుతుంది. స్త్రీ శరీరం కూడా సన్నద్ధమవుతుంది. అలా జరిగినప్పుడే సాంగత్యం అమృతం. లేదంటే.. ఆఫీస్ లో గడియారం వంక చూసి షిఫ్ట్ అయిపోగానే వెళ్లిపోయే ఫక్తు డ్యూటీలా ముగిసిపోతుంది. కాబట్టి.. సెక్స్ అనేది కేవలం 2 Body Partsకు సంబంధించిన విషయం ఎన్నటికీ కాదు.. కాకూడదు. అది హృదయంతో ఆస్వాదించాల్సిన అంశం.

కానీ.. దారుణం ఏమంటే 99 శాతం సమాజం కూడా శృంగారాన్ని 2 జననాంగాల విషయంగానే చూస్తోంది. అందుకే.. మెజారిటీ ఇళ్లు మారిటల్ బ్రోతల్ హౌసెస్ గా మారుతున్నాయి. వేశ్యా గృహంలో ఆమె కోరికతో పనిలేదు. చాలా ఇళ్లలో కూడా అంతే.. ఆమె ఫీలింగ్స్ అవసరమే లేదు.
బెడ్రూమ్లో పని పూర్తయి.. ఆసుపత్రి గదిబయట వెయిట్ చేసే పెద్దలకు పిల్లాడి ఏడుపు వినిపిస్తే సరిపోయే. భార్యాభర్తలు పిచ్చ హ్యాపీగా ఉన్నట్టే లెక్క. కానీ.. అమ్మాయి మనసుతో ఎవరికీ అవసరం లేదు. అందుకే.. మెజారిటీ అమ్మాయిలు పరువు మాటున.. తలుపు చాటున.. “కళ్లు మూసుకొని” కాపురం చేస్తుంటారు. ఈ పరిస్థితి రావొద్దు అంటే.. వివాహం రెండు హృదయాల మధ్య జరగాలి తప్ప.. మనుషుల మధ్య కాదు. పెళ్లి అనేది ప్రేమికుల మధ్య.. లేదంటే ఇష్టపడ్డ వారి మధ్య జరగాలి తప్ప.. కుటుంబాల మధ్య కానే కాదు.
మనిషి జీవితంలో సెక్స్ అవసరాన్ని అర్బన్ ఇండియా ఏనాడో గుర్తించింది.
అందుకే.. ఇక్కడ సహజీవనాలు పెరిగిపోతున్నాయి. చివరకు.. “వన్ నైట్ స్టాండ్” కూడా పికప్ అవుతోంది. తాజాగా.. అమితాబ్ భార్య జయాబచ్చన్ మాట్లాడుతూ.. “నా మనవరాలు పెళ్లికి ముందే తల్లి అయినా నాకు అభ్యంతరం లేదు” అన్నారు. ఆమె లాంటి కొద్దిమంది మాత్రమే బయటకు చెప్పినా.. ఇన్నర్‌గా మెజారిటీ అర్బన్ ఇండియా సెక్స్ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. కానీ.. కట్టుబాట్లకు కాపలాదారు అయిన రూరల్ ఇండియా మాత్రం ఆ వైపు కన్నెత్తి చూడటం కాదు కదా.. కనీసం ఆలోచించడానికే సాహసం చేయట్లేదు. కేవలం పడకగదిలో లైట్ ఆర్పేస్తే చాలు అనుకుంటోంది.
ఇక్కడ నా ఉద్దేశం సహజీవనాలు చేయాలనో.. వన్ నైట్ స్టాండ్స్‌లో ప్లేయర్ కావాలనో కాదు.. సెక్స్ అనేది ఫీలింగ్స్‌కు సంబంధించిన విషయం అని చెప్ప దలుచుకున్నా. దాన్ని ఎంతగా ఆస్వాదిస్తే పర్సనల్ లైఫ్..ఫ్యామిలీ లైఫ్ అంత హ్యాపీగా ఉంటుందని చెబుతున్నా. ఇది గుర్తించకపోతే బెడ్ రూమ్‌లో చేసేది కూడా జస్ట్ “డ్యూటీ”.
-రాధా