https://oktelugu.com/

Home Loan: ఫ్లోటింగ్ వడ్డీ.. ఫిక్స్ డ్ వడ్డీకి తేడాలేంటి? HomeLoan తీసుకునేవారికి ఏదీ బెటర్?

ఇల్లు నిర్మించుకోవడానికి బ్యాంకు లోన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇల్లు కోసం ముందే పెద్ద మొత్తంలో నగదును అందించి నెలనెలా ఈఎంఐ రూపంలో వసూలు చేసుకుంటుంది. ఉద్యోగాలు, వ్యాపారస్తులు ఎక్కువగా లోన్ కోసమే ప్రిఫర్ చేస్తుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 9, 2023 9:40 am
    Home Loan

    Home Loan

    Follow us on

    Home Loan: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. నేటి కాలంలో ఇల్లు నిర్మించడం మాములు విషయం కాదు. మధ్యతరగతి పీపుల్స్ ఇల్లు కట్టడం ఒక సాహసమే అని చెప్పవచ్చు. ఇల్లు నిర్మించడానికి ఒకే మొత్తంలో డబ్బు లేనప్పుడు బ్యాంకులు అప్పులు ఇస్తుంటాయి. మిగతా రుణాల కంటే హోమ్ లోన్ పై వడ్డీ తక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా వినియోగదారుల సాలరీ, ఆదాయాన్ని భట్టి వడ్డీ రేట్లలో కూడా మార్పులు చేస్తుంటారు. ఇదే సమయంలో బ్యాంకు వారు ఫ్లోటింగ్ వడ్డీ కావాలా? లేదా ఫిక్స్ డ్ వడ్డీ కావాలా? అని అడుగుతారు. చాలా మంది వినియోగదారుకు వీటిపై సరైన అవగాహన లేదు. మరి వీటి గురించి తెలుసుకుందామా?

    ఇల్లు నిర్మించుకోవడానికి బ్యాంకు లోన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇల్లు కోసం ముందే పెద్ద మొత్తంలో నగదును అందించి నెలనెలా ఈఎంఐ రూపంలో వసూలు చేసుకుంటుంది. ఉద్యోగాలు, వ్యాపారస్తులు ఎక్కువగా లోన్ కోసమే ప్రిఫర్ చేస్తుంటారు. అయితే ఇక్కడ బ్యాంకు వారు ఫిక్స్ డ్ వడ్డీ కావాలా అని అడుగుతారు. ఫిక్స్ డ్ వడ్డీ అంటే బ్యాంకు లోన్ తీసుకునే సమయంలో వడ్డీ ఎంతైతే ఉంటుందో అదే వడ్డీ రేటు లోన్ పూర్తయ్యేవరకు ఉంటుంది. ఉదాహరకు 20 సంవత్సరాల టెన్యూర్ పెట్టుకుంటే అప్పటి వరకు ఇదే వడ్డీ రేటు కొనసాగుతుంది.

    ఫ్లోటింగ్ వడ్డీ రేటు విషయానికొస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం హోమ్ లోన్ తీసుకున్న తరువాత మధ్యలో వడ్డీ రేట్లు మారితే ఈఎంఐ కూడా మారుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే ఈఎంఐల మొత్తం పెరిగే అవకాశం ఉంది. ఇది ఆర్బీఐ నిర్ణయంపై ఆధారపడుతుంది. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులతో పాటు దేశంలోని కొన్ని సంఘటనల ద్వారా వడ్డీ రేట్లు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.

    బ్యాంకు లోన్ తీసుకునేవారు ఏది ఎంచుకుంటున్నారో ముందే చెప్పాల్సి ఉంటుంది. అయితే రెండింటిలో ఫిక్స్ డ్ వడ్డీ రేటుకే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ వడ్డీ రేట్లు పెరగడమే గానీ.. తగ్గడం ఉండదని కొందరు ఆర్థిక నిపుణుల అభిప్రాయం. అయితే ఫ్లోటింగ్ వడ్డీని ఎంచుకోవడం ద్వారా వడ్డీ రేటు తగ్గుతుందని కొందరు అంటున్నా.. అటువంటి సందర్భాలు తక్కువే అంటున్నారు.