https://oktelugu.com/

Karthika Masam 2023 : కార్తీక మాసంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?

ఈ మాసంలో మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడు, మిగతా 15 అధ్యాయాలు విష్ణువు ప్రాధాన్యతను తెలియజేస్తాయి.

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2023 11:16 am
    Follow us on

    Karthika Masam 2023 : ప్రతీ ఏటా దీపావళి అమావాస్య తరువాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈసారి దీపావళి రెండు రోజులు జరుపుకున్నందున నవంబర్ 14న సూర్యోదయం పాడ్యమి ఉండడంతో ఈరోజును నుంచి మొదలవుతుంది. కార్తీక మాసంను ఆధ్యాత్మిక మాసంగా పేర్కొంటారు. ఈ నెలలో ఎక్కువగా నియమ నిష్టలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కావడంతో వారిని పూజింజడం వల్ల విశేష ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. దాన, ధర్మాలు కూడా ఈ నెలలో ఎక్కువగా చేయడం వల్ల శుభం జరగుతుందని అంటున్నారు. అయితే కార్తీక మాసంలో ఏ రోజుకు విశేషమైన గుర్తింపు ఉంటుంది? ఈ మాసంలో పాటించాల్సిన నియమాలు ఏవి? ఎలాంటి పూజలు చేయాలి? అనే వివరాల్లోకి వెళితే..

    కార్తీక మాసంలో నవంబర్ 17న నాగుల చవితి వస్తుంది. ఈరోజు సుబ్రహ్మణ్యశ్వేర స్వామిని పూజించాలి. నాగుల పుట్టకు వెళ్లి పాలు పోయడం వల్ల దు:ఖాలు తొలిగిపోతాయి. ఇదే నెలలో సుభ్రహ్మణ్య షష్టి వస్తుంది. ఈరోజు బ్రహ్మచారికి ఎర్రని వస్త్రం లేదా కండువా దానం చేసినవారికి సంతాన యోగం కలిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. నవంబర్ 27న కార్తీక రెండో సోమవారం ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజున శివుడికి జ్వాలాతోరణం దర్శనం చేసుకోవడం వల్ల సర్వ పాపాలు తొలిగిపోతాయని అంటున్నారు. కొత్తగా పెళ్లయిన వారు 16 రకాల పండ్లతో శివ పూజ చేయాలి.

    కార్తీకమాసం ఎంతో నిష్టతో పూజలు చేయాలి. అందు కోసం కొన్ని నిబంధనలు పాటించాలి. మనసు ప్రశాతంగా ఉండేందుకు కొన్ని ఆహార అలవాట్లు పాటించారు. ముఖ్యంగా పూజల్లో పాల్గొనేవారు ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉండాలి. ఇతరులకు ద్రోహం చేయాలనే ఆలోచన రానియొద్దు. దీపారాధనలకు తప్ప నువ్వుల నూనెను ఇతర అవసరాలకు ఉపయోగించవద్దు. మినుములు తినకూడదు, నులుగు పెట్టుకొని స్నానం చేయకూడదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

    కార్తీక మాసం శివుడు, విష్ణవులకు ప్రీతికరం. ఈ నెలలో శివ దర్శనం ఎంతో పుణ్యఫలం ఇస్తుంది. కార్తీక మాసంలో వచ్చే ప్రతీ సోమవారం ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేయడం వల్ల అనుగ్రహం పొందుతారు. ఈ మాసంలో మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడు, మిగతా 15 అధ్యాయాలు విష్ణువు ప్రాధాన్యతను తెలియజేస్తాయి.

    *కార్తీక మాసంలోని ముఖ్యమైన రోజులు ఇవీ