Astrology Tips: ఈ రోజు శని కుంభరాశిలోకి ప్రవేశించడంతో ద్వాదశ రాశుల ఫలితాలు మారనున్నాయి. నేటి పంచాంగంతో అన్ని రాశుల వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయని తెలుస్తోంది. చంద్రుడు మీన రాశి నుంచి మారడంతో అదృష్ట నక్షత్రాలు ఏం సూచిస్తున్నాయి.

మేషరాశి వారికి ఈ రోజు కుటుంబసభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తిలో కూడా రాణిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఆదాయం బాగుంటుంది. శుభవార్తలు వింటారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. అదృష్టం కూడా బాగుంటుంది. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఇంటా, బయట మీ మాటకు చెల్లుబాటు ఉంటుంది. పదిమందిలో గౌరవం పెరుగుతుంది.

వృషభరాశి వారికి ఈ రోజు అందరితో మర్యాదపూర్వకంగా మాట్లాడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా మారతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అదృష్ట సంఘటనలు జరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది.
మిథునరాశి వారికి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు పెరగవు. ఉన్నతాధికారులు మీపై ఆగ్రహంతో ఉంటారు. ప్రతికూల ప్రభావంతో కొన్ని పనులు ముందుకు సాగవు. ఆంజనేయుడిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో ఒక సభ్యుడి విషయంలో ఆనందం కలుగుతుంది. కొన్ని పనుల్ల అడ్డంకులు ఎదురుకావచ్చు.
సింహరాశి వారికి ఈ రోజు ధైర్యంతో సవాళ్లను అధిగమిస్తారు. ఆస్తి సంబంధ విషయాలు అనుకూలం. మహిళలు వ్యాపారంలో రాణిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు కూడా అనుకూలం. అదృష్ట సంఘటనలు చోటుచేసుకుంటాయి. కృష్ణుడిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి. కొత్త మార్గాలు కనుగొటారు. వ్యాపారాల్లో మంచి లాభాలు చేతికి అందుతాయి.
కర్కాటక రాశి వారికి ఈ రోజు డబ్బు విషయంలో జాగ్రత్తలు అవసరం. వ్యాపార లావాదేవీలు కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మంచి ఆరోగ్యం ఉంటుంది. ఈ రోజు అదృష్టం మీదే. కనకధార స్తోత్రాన్ని పఠించండి మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా మంచి ఫలితాలు రావాలంటే దైవరాధన చేయడం మంచిది. అనుకున్నది సాధిస్తారు. అందరిలో ప్రశంసలు వస్తాయి.
కన్యా రాశివారికి ఈ రోజు శుభవార్తలు వింటారు. పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన ఉద్యోగావకాశాలున్నాయి. హనుమాన్ చాలీసా చదవండి మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ మార్పులకు కూడా వీలుంది. నూతన ప్రాజెక్టులు చేపడతారు. అనుకున్నది సాధిస్తారు.
తులా రాశి వారికి ఈ రోజు కొత్తగా లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. ధనలాభం ఉంది. ఏపని అయినా ప్రశాంతంగా చేసుకోండి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుంది. సమస్యలు అధిగమిస్తారు. అదృష్ట సంఘటనలు ఉన్నాయి. తల్లిదండ్రులను పూజించండి. అనుకున్నది సాధిస్తారు. లక్ష్య సాధన వైపు అడుగులు వేస్తారు. అందరిలో గుర్తింపు ఉంటుంది.
Also Read: Nara Disti: నరదిష్టి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదా?
వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. లక్ష్యాన్ని సాధిస్తారు. బ్యాంకు నుంచి రుణం పొందుతారు. రుణాలు చెల్లిస్తారు. కొత్త ఉద్యోగం సాధిస్తారు. శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆవుకు పచ్చి మేత తనిపించండి మంచి ఫలితాలు ఉంటాయి.
ధనూరాశి వారికి ఈ రోజు ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకుంటారు. డబ్బు అవసరానికి చేతికి అందుతుంది. బ్యాంకు రుణాలు అందుతాయి. జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా కొనసాగుతాయి. మహాలక్ష్మిని నూజించాలి. అన్ని శుభాలే జరుగుతాయి.
మకరరాశి వారికి ఈ రోజు సంతోషకరమైన వార్తలు వింటారు. పనుల్లో వేగం పెరుగుతుంది. వ్యాపార లావాదేవీల్లో అనుకూలం. మంచి ఫలితాలు ఉంటాయి. గురువుల ఆశీర్వాదం తీసుకోండి. వ్యాపారంలో రాణిస్తారు. ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారతాయి.
కుంభరాశి వారికి ఈ రోజు అందరి ప్రశంసలు పొందుతారు.ముఖ్యమైన పనులు పెండింగులో ఉంటాయి. కొత్తగా ఉద్యోగావకాశాలు వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. వినాయకుడిని పూజించాలి. మంచి ఫలితాలు వస్తాయి. మీ పనికి సరైన గుర్తింపు లభిస్తుంది.
మీన రాశి వారికి ఈ రోజు అందరితో మర్యాదగా మాట్లాడాలి. కొత్త అవకాశాలు వస్తాయి పనుల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి, మంచి స్థానం లభించే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. శివచాలీ సా పఠించడం వల్ల మేలు జరుగుతుంది.
Also Read: Bandi Sanjay: కేసీఆర్.. వలసలకు సాక్షమిదిగో.. నిరూపించి సంచలనం సృష్టించిన ‘బండి’
Recommended Videos: