Unhealthy Habits: మనలో చాలా మంది తెలిసో తెలియకో భోజనం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోరు. ఎలా పడితే అలా తింటూ ఉంటారు. కానీ అలా చేస్తే తిన్నది మనకు జీర్ణం కాదు. భోజనం పద్ధతిగా చేయాలి. సమయం లేకపోతే భోజనం మానేయాలి. కానీ హడావిడిగా తప్పులు చేస్తూ తినడం శ్రేయస్కరం కాదు. తినడానికి కూడా కొన్నిపరిమితులు ఉన్నాయి. కొన్ని పద్ధతులు పాటించాలి. జంతువుల మాదిరి కాకుండా మంచి శుచిగా తింటేనే ఒంటికి పడుతుంది.
మంచం మీద కూర్చుని..
చాలా మంది మంచం మీద కూర్చుని తింటుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. కొందరు పిల్లల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని తినిపిస్తారు. ఇది కూడా సరికాదు. అన్నంతినేటప్పుడు మీద కూర్చుని తింటే రోగాలకు కారణమవుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. అన్నం తినేటప్పుడు త్రికరణ శుద్ధిగా తినాలి. కిందకూర్చుని భోజనంచేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.
సంప్రోక్షణ చేయాలి
అన్నం తినే ముందు నీళ్లతో సంప్రోక్షణ చేయాలి. భోజనం చుట్టు నీళ్లు చల్లుకుని మంత్రం చదివి దేవున్ని ప్రార్థించాలి. అనంతరం ఒక ముద్ద తీసి పక్కన పెట్టి తినాలి. భోజనం చేసిన తరువాత ఆ ముద్దను పక్షులకు ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే మనం తినే అన్నం మనకు ఒంట పడుతుంది. పద్ధతి ప్రకారం తింటేనే మనకు అన్ని విధాలా సహకరిస్తుంది. లేదంటే మనం తిన్న ఆహారం మనకు జీర్ణం కాదు.
భోజనం విషయంలో..
అన్నం తినేటప్పుడు దేవుడిని ప్రార్థించాలి. ఐదు వేళ్లతో తినేందుకు ప్రయత్నించాలి. ఈ రోజులలో చాలా మంది ఫ్యాషన్ కు పోయి నిలబడి తింటున్నారు. పైగా స్పూన్లతో లాగించేస్తున్నారు. ఇది సరైంది కాదు. భోజనం విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు ఇబ్బందులు రావడం ఖాయం. మంచం మీద కూర్చుని తింటే భోజనం మన ఒంటికి పట్టదు.