Coconut Water: వేసవిలో కొబ్బరి బొండాం నీళ్లు చల్లదనాన్ని ఇస్తాయి. ఇది తాగడం వల్ల దాహం తీరడమే కాకుండా శరీరంలోని ఉష్ణోగ్రతను బయటకు పంపిస్తాయి. అయితే చాలా మంది కొబ్బరి నీళ్లను అవైడ్ చేసి కూల్ డ్రింక్స్ తాగుతారు. కూల్ డ్రింక్స్ కంటే కొబ్బరిబొండాం రేటు తక్కువగా ఉండడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే కొంతమంది కొబ్బరి నీళ్లను ఉదయాన్నే తాగాలని చెబుతున్నారు. పరగడుపున కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా?
కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది. కొబ్బరి నీళ్లలో ఉండే ప్రోటీన్స్, కొవ్వు , పిండిపదార్థాలు, ఫైబర్, కాల్షియంలు అదనంగా ప్రయోజనం చేకూరుతాయి. ఈ నీళ్లలో కొంచెం నిమ్మరం వేసుకొని తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోరల్స్ సమతుల్యమవుతాయి. దీంతో ప్రత్యేకంగా గ్లూకోస్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.
వేసవిలోనే కాకుండా అన్ని కాలాల్లో కొబ్బరి నీళ్లు అందుబాటులో ఉంటున్నాయి. అందువల్ల వీలు దొరికినప్పుడల్లా వీటిని తీసుకోవడం మంచిదే. అయితే కొందరు ఉదయాన్నే కొబ్బరినీళ్లు తీసుకోవడం మరీ మంచిదని అంటున్నారు. ఉదయం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతంది. పొద్దున్నేదీనిని తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు. ఇవి తాగి బయటకు వెళ్లడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ఇతర రసాయనాలు బయటకు వెళ్లిపోతాయి.
కేవలం శరీరంలోని అవయవాలను సక్రమంగా పనిచేయడమే కాకుండా చర్మం కాంతివంతంగా మెరవడానికి కూడా కొబ్బరి నీళ్లు పనిచేస్తాయి. ఇవి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గి స్లిమ్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఇవి జీర్ణావస్థను సెట్ చేస్తుంది కాబట్టి ఎలాంటి బరువు పెరుగరు. అందువల్ల సాధ్యమైనంత వరకు కొబ్బరినీళ్లు తీసుకోవడం మంచిదేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.