Sleep: ప్రతి రోజూ ఒకే సమయంలో నిద్రించకపోతే ఏమవుతుంది?

ప్రపంచంలో ప్రతీ వ్యక్తి ఏదో ఒక రుగ్మతలతో బాధపడుతూ ఉంటాడు. కానీ నేటి కాలంలో ప్రతి ఒక్కరూ నిద్ర సమస్యతో బాధపడుతున్నారు. కొందరు పనుల ఒత్తిడి వల్ల సుఖ నిద్ర పోలేరు.

Written By: Chiranjeevi Appeesa, Updated On : November 14, 2023 7:39 pm

Sleep

Follow us on

Sleep: ఇప్పుడంతా స్పీడ్ యుగం. ప్రతీ పనిని వేగంగా చేస్తే తప్ప అనుకున్నవన్నీ పూర్తి కావు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనితో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మెదడుపై ప్రభావం పడి సరైన నిద్ర రాకుండా చేస్తుంది. చాలా మంది ఇప్పుడున్న వారిలో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని పనులు ఉన్నా నిద్ర గడియారాన్ని పాటించాలంటున్నారు కొందరు పరిశోధకులు రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం.. నిద్రలేవడం అనేది నిర్ణయించుకోవాలంటున్నారు. అలా చేయకుండా ఇష్టమొచ్చినట్లు నిద్ర పోతే ఏం జరుగుతుందో పరిశోధకులు తేల్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రపంచంలో ప్రతీ వ్యక్తి ఏదో ఒక రుగ్మతలతో బాధపడుతూ ఉంటాడు. కానీ నేటి కాలంలో ప్రతి ఒక్కరూ నిద్ర సమస్యతో బాధపడుతున్నారు. కొందరు పనుల ఒత్తిడి వల్ల సుఖ నిద్ర పోలేరు. మరికొందరు గాడ్జెట్స్ ఉపయోగించడం వల్ల అవి మెదడుపై ప్రభావం చూసి నిద్రను చెడగొడుతుంది. కొందరికి ఎలాంటి పనులు లేకున్నా కూడా సరైన నిద్ర పట్టదు. బెడ్ పై పడుకున్నా.. ఏవేవో ఆలోచనలతో మనసు పాడవుతుంది. దీంతో సరైన నిద్ర పోవడానికి కొన్ని అలవాట్లు చేసుకోవాలి. ఇందులో భాగంగా నిద్రగడియారాన్ని సెట్ చేసుకోవాలి.

అందరూ ఒకే పనలు చేయరు. కొందరు ఉదయం విధులు చేస్తే..మరికొందరు సాయంత్రం పనుల్లో బిజీ అవుతాయరు. అయితే ఎవరు ఏ పనిచేసిన కనీసం 6 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు నిద్రించినా ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంత వాతావరణంలో నిద్రపోయే విధంగా పరిస్థితులను మార్చుకోవాలి. నిద్రపోయే సమయంలో ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా ఉండే విధంగా మలుచుకోవాలి. అలా కాకుండా ఇష్టమొచ్చినట్లు నిద్రపోవడం వల్ల శరీరంలో అనేక మార్పలు జరుగుతాయి.

తాజాగా పరిశోధకు తేల్చిన వివరాల ప్రకారం.. రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం చాలా మంచిది. అలా కాని పక్షంలో ప్రేగుల్లో అనేక సమస్యలు ఎదురవుతాయి. సమయపాలన లేకుండా నిద్రపోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడానికి సహకరించదు. దీంతో జీర్ణాశయంపై ప్రభావం చూపి ప్రేగుల్లో ఉండే బాక్టీరియా నశించిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. నిద్రపోవడంతో పాటు నిద్ర లేచే సమయం కూడా ఒకేలా నిర్ణయించుకోవాలని చెబుతున్నారు.