https://oktelugu.com/

Kidney Problems: కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఏ పండ్లను తినాలి? ఏవి తినకూడదు?

మానవ శరీరంలో కిడ్నీలు ప్రధాన అవయవాలు. శరీరంలోని మురికిని, ధ్రవాలను ఫిల్టర్ చేసి మూత్రపిండాల ద్వారా చెడు వాటర్ ను పంపించే ప్రక్రియను కిడ్నీలు చేపడుతాయి.

Written By:
  • Mahi
  • , Updated On : October 19, 2023 / 03:51 PM IST

    Kidney Problems

    Follow us on

    Kidney Problems: కాలం పరుగెడుతున్న కొద్దీ మనుషులు కూడా అంతేస్థాయిలో ఉరుకులు, పరుగుల జీవితాలను గడుపుతున్నారు. ప్రతీ రంగంలోని అనుకున్న లక్ష్యాలను చేరడానికి సమయం, సందర్భం లేకుండా శ్రమిస్తున్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలో బిజీ వాతావరణంలో మునిగి ఆరోగ్యంపై శ్రద్దపెట్టడం లేదు. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులు చేరి సతమతమవుతున్నారు. నేటి కాలంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అరోగ్య సమస్య వెంటాడుతోంది. వీటిల్లో ప్రధానంగా కిడ్నీ సమస్య తీవ్రమవుతోంది. ఆహారంలో నాణ్యత లోపించడంతో పాటు సరైన నీరు తీసుకోకపోవడం వల్లే కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వ్యాధితో బాధపడేవారు కొన్ని రకాల పండ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ పండ్ల గురించి తెలుసుకుందాం..

    మానవ శరీరంలో కిడ్నీలు ప్రధాన అవయవాలు. శరీరంలోని మురికిని, ధ్రవాలను ఫిల్టర్ చేసి మూత్రపిండాల ద్వారా చెడు వాటర్ ను పంపించే ప్రక్రియను కిడ్నీలు చేపడుతాయి. మనుషులు సక్రమమైన ఆహారం తీసుకుంటూ సరైన నీరు తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ సమయానికి సరైన తిండి లేకున్నా.. జంక్ ఫుడ్ తీసుకున్నా.. వాటర్ ఎక్కువగా తీసుకోకపోయినా కిడ్నీలో స్టోన్స్ వస్తుంటాయి. ఇవి ఎక్కువగా వస్తే తీవ్రంగా బాధేస్తుంది.

    కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కావొచ్చు. చాలా మంది సమయానికి ఆహారం తీసుకున్నా.. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయి. ఒక్కోసారి వీటి కోసం చికిత్స తీసుకున్నా నయం కాకపోవచ్చు. ఈ క్రమంలో కేవలం వైద్య చికిత్సనే కాకుండా వైద్యుల సలహాతో కొన్ని ఫ్రూట్స్ ను తీసుకుంటూ ఉండాలి.

    కిడ్నీ సమస్యలు ఉన్నవారు ప్రధానంగా వాటర్ పర్సంటేజ్ ఎక్కవుగా ఉన్నవి తీసుకోవాలి. పుచ్చకాయ, కర్బుజా, వంటి వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి తరుచుగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తుంది. అంతేకాకుండా ఎనర్జీని ఇస్తుంది. వీటితో పాటు బ్లాక్ బెర్రీ,కివీ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ గా తీసుకునే ఆహారంతో పాటు ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి పరిష్కారం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.