Curly Hair : జుట్టు లేకుండా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. వామ్మో భయం వేస్తుంది కదా. జుట్టు లేకుండా మనిషి ముఖ సౌందర్యం పూర్తిగా పోతుంది. కానీ జుట్టు పని అందాన్ని మెరుగుపరచడమే కాకుండా, సూర్యకాంతి నుంచి శిరోజాలను రక్షించడానికి కూడా పనిచేస్తుంది. వేర్వేరు వ్యక్తుల జుట్టు ఆకారం కూడా భిన్నంగా ఉంటుంది కదా. కొంతమందికి స్ట్రెయిట్ హెయిర్ ఉంటే చాలా మందికి గిరజాల జుట్టు అంటే కర్లీ హెయిర్ అదేనండి రింగుల జుట్టు ఉంటుంది. మరి ఈ రింగుల జుట్టు వెనుక కారణం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించారా? ఎందుకులే అందంగా ఉంటుంది అని లైట్ తీసుకున్నారా? కానీ దీని వెనుక కూడా సైన్స్ ఉంది. అదేంటంటే?
హెయిర్ ఫోలికల్స్
సరళమైన భాషలో చెప్పాలంటే జుట్టు కుదుళ్లు ఈ రింగుల జుట్టుకు బాధ్యత వహిస్తాయట. ఇవి చర్మం లోపల ఉంటాయి. స్ట్రెయిట్ హెయిర్ ఫోలికల్స్ స్ట్రెయిట్ హెయిర్ ఫైబర్‌లను ఉత్పత్తి చేస్తాయి. అయితే వంకరగా ఉండే ఫోలికల్స్ నుంచి రింగుల జుట్టు పెరుగుతుంది. అయితే తలలో వంకరగా ఉండే హెయిర్ ఫోలికల్స్ ఎందుకు ఉన్నాయి అనుకుంటున్నారా?
ప్రతి జుట్టు వెంట్రుకల ఫోలికల్స్ ఆకారం పిండం అభివృద్ధి సమయంలో ఏర్పడుతుంది. అయితే ఇది ఎలా జరుగుతుందో శాస్త్రవేత్తలకు కూడా తెలియదు. వంగిన వెంట్రుకల కుదుళ్లు S ఆకారంలో ఉంటాయి. ఇవి రెండు చివరలను కలిగి ఉంటాయి. ఈ ఆకారం ఎప్పటికీ అలాగే ఉంటుంది. కానీ ఏడాది తర్వాత జుట్టు కుదుళ్లు అనేక నిర్మాణాత్మక మార్పులకు లోనవుతాయి. తలపై ఉన్న ప్రతి వెంట్రుక కూడా సుమారు 3 నుంచి 5 సంవత్సరాల వరకు పెరుగుతాయి. ఆ తర్వాత అది తలపై నుంచి ఊడిపోతుంది.
పరిశోధన ప్రకారం, విశ్రాంతి దశలో హెయిర్ ఫోలికల్స్ నిర్మాణం మారుతుంది. జుట్టు పెరుగుదల కొత్త దశను ప్రారంభించడానికి ముందు, ఫోలికల్స్ వాటి మునుపటి పరిమాణానికి తిరిగి వస్తాయి. అంటే వెంట్రుకల కుదుళ్లు నిటారుగా ఉంటే వెంట్రుకలు నిటారుగా వస్తాయి. కానీ కుదురుగా ఉంటే వెంట్రుకలు వంకరగా వస్తాయి.
జన్యువుల ప్రభావం కూడా
జుట్టు వంకరగా ఉండటం జన్యువులపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి జుట్టు వంకరగా లేదా నిటారుగా ఉంటుందా అనేది అతని జన్యువులు నిర్ణయిస్తాయి. అంటే, తల్లిదండ్రులలో ఒకరికి రింగుల జుట్టు ఉంటే, వారి పిల్లలకు కూడా రింగుల జుట్టు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కొన్ని ప్రొటీన్లను కణాలు విభజించి ఉత్పత్తి చేసే విధానం అసమానంగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి వంగిన ఫోలికల్స్ వంపులుగా వంగి ఉంటాయి. దీని వల్ల జుట్టు వంకరగా మారుతుంది. కాబట్టి, ఈ సారి మీరు మీ జుట్టును అద్దంలో చూసుకుని, మీ జుట్టు నిటారుగా ఉందా లేదా వంకరగా ఉందా అని ఆలోచిస్తున్నప్పుడు మీకు ఈ విషయం అర్థం అవుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..