https://oktelugu.com/

Dreams : కలలో దేవుళ్లు కనిపిస్తే అర్థం ఏమిటి?

కొందరికి రోజుతో సంబంధం లేని కలలు వస్తుంటాయి. అంటే కలలో దేవుళ్లు కనిపిస్తూ ఉంటారు. చాలా మంది దేవుళ్లు కనిపించగానే అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. అయితే

Written By: Srinivas, Updated On : March 2, 2024 11:30 am

god in dream

Follow us on

Dreams : నిద్రించేటప్పుడు మనసు ఎంతో రిలాక్స్ అవుతుంది. అయితే ఇదే సమయంలో కొన్ని పాడు కలలు రావడం వల్ల మనసు పాడవుతుంది. రోజంతా ఎలాంటి పరిస్థితులు ఉంటే అలాంటి కలలు వస్తాయని కొందరు అంటుంటే..మరికొందరు మాత్రం కలలు రావడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. కొందరికి రోజుతో సంబంధం లేని కలలు వస్తుంటాయి. అంటే కలలో దేవుళ్లు కనిపిస్తూ ఉంటారు. చాలా మంది దేవుళ్లు కనిపించగానే అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. అయితే దైవం కలలో కనిపించడం మంచిదే గానీ.. ఇలా కనిపించడానికి కొన్ని కారణాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.

దేవుళ్లు కలలో కనిపించడం వల్ల హాయిగానే ఉంటుంది. కానీ ఇలా ఊహించకుండా కలలో రావడం వల్ల ప్రత్యేక పరిస్థితి అని తెలుసుకోవాలి. అంటే కలలో దేవుళ్లు కనిపిస్తున్నారంటే ఏదో చెప్పబోతున్నారని అర్థం. ఒక దేవత లేదా దేవుడు కనిపించారంటే ఆధ్యాత్మికత వైపు ప్రయాణించేందుకు సిద్ధం అవుతున్నారని అర్థం. జీవితంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికే ఈ కలలు వస్తాయని అర్థం. అంతేకాకుండా ఎవరైనా ఒక వస్తువు కోసం వెతికే వారికి దేవుళ్లు కలలో కనిపిస్తారు.

కష్ట కాలంలో ఉన్నవారు దైవానుగ్రహం కోసం దేవుడి మద్దతు ఉంటుందని తెలపడానికే దేవుళ్లు కలలో కనిపిస్తారు. ఒక గొప్ప ఉద్దేశంతో బతకాలనుకునేవారికి ఒక మార్గం ఏర్పడడానికి దేవుళ్లు కనిపించి సంకేతాన్ని సూచిస్తారు. ప్రధానంగా ఎక్కువగా ఆధ్యాత్మిక మద్దతు ఉండేవారికి దేవుళ్లు ముందుగానే కలలో కనిపించి సంకేతాలు ఇస్తారట. కొన్ని సార్లు ఇవి అనుకూలంగా మారినా..మరికొన్ని సార్లు హెచ్చరికలు జారీ చేసే విధంగానూ ఉంటాయని చెబుతున్నారు.