https://oktelugu.com/

Snake Bite Dream: పాము కాటు వేసినట్లు కల వస్తోందా.. అయితే జరిగేది ఇదే.. తప్పక తెలుసుకోండి!

సృజనాత్మకత శక్తి అధికంగా ఉన్న వారికే పాములు కలలో కనిపిస్తాయని సర్పశాస్త్రం చెబుతోంది. పాము కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఏమో అని అందరూ భయపడుతుంటారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 19, 2023 / 01:43 PM IST
    Follow us on

    Snake Bite Dream: మనం నిద్రిస్తున్నప్పుడు సాధారణంగా రకరకాల కలలు వస్తుంటాయి. కొన్ని మనకు హాయినిస్తే.. మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని కలలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అలా నిద్రలో మనకు వచ్చే కలల్లో ఎక్కువగా భయపెట్టేవి పాములు. పాములు కల్లోకి వచ్చిప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు. సాధారణంగా మనకు వచ్చే కలలు మన జీవితంలో జరిగిన లేదా జరగబోయే సంఘటనలకు సంకేతాలుగా భావిస్తుంటారు కొందరు. పాములు కలలో కనిపిస్తే శివుడికి మొక్కుకున్న మొక్కులు తీర్చలేదనే సంకేతమని ఇలా రకరకాలుగా భావిస్తుంటాయి. పాములు శరీరంపై పాకుతున్నట్లు, కాటేస్తున్నట్లు, బుస కొడుతున్నట్లు ఇలా రకరకాలుగా కలలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి దేనికి సంకేతమో తెలుసా..?

    వారికి ఎక్కువగా..
    సృజనాత్మకత శక్తి అధికంగా ఉన్న వారికే పాములు కలలో కనిపిస్తాయని సర్పశాస్త్రం చెబుతోంది. పాము కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఏమో అని అందరూ భయపడుతుంటారు. మీ కలలో పాము కనిపించి అది కాటు వేసి వెళ్లిపోతే ఇక ఎలాంటి సమస్య ఉండదని శాస్త్రం చెబుతోంది. అలాగే పాము కనిపించి ఏమీ చేయకుండా మెల్లగా జారుకుంటే ఆ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉంటారు. అయితే పాము కలలో మిమ్మల్ని వెంటాడితే మాత్రం సమస్యలు, కష్టాలు తప్పవు.

    అందుకు సిద్ధంగా ఉండాలి..
    పాము కలలో మిమ్మల్ని వెంటాడినట్లయితే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవడానికి సిద్థంగా ఉండాలి. పాము వెంటాడినట్లు కనిపించినా, లేదా తరచూ సాములు స్వప్నంలో కనిపిస్తేనూ ప్రతి శుక్రవారం నాగదేవతకు పాలు పోసి పూజించాలి. పాము పుట్టకు పసుపు, కుంకుమ, నల్లగాజులు ఉంచి సుబ్రమణ్యస్వామికి అర్చనలు, అభిషేకాలు చేయాలి. భక్తితో స్వామిని ప్రార్థిస్తే సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.