https://oktelugu.com/

Naga Sadhuvu :  నాగ సాధువులకు పీరియడ్స్ వస్తాయా? ఒకవేళ వస్తే ఏం చేస్తారు?

మహిళలు నాగ సాధవుల్లా మారడం చాలా కష్టం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వారు నాగ సాధువులుగా మారుతారు. ఒక మహిళ నాగ సాధువుగా మారాలంటే కొన్నేళ్ల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. దాదాపుగా 6 నుంచి 12 ఏళ్ల పాటు బ్రహ్మచర్యం పాటిస్తేనే వారు నాగ సాధువులుగా మారుతారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 22, 2024 / 07:13 AM IST

    Women Naga Sadhus

    Follow us on

    Naga Sadhuvu : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నాగ సాధువుల గురించి ఎక్కువగా చర్చ నడుస్తోంది. వీరంతా మహా కుంభమేళాకు హాజరవుతారని చర్చ నడుస్తోంది. అలాగే తెలంగాణలో లేడీ అఘోరా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమె నగ్నంగా ఉంటుంది. సాధారణంగా నాగ సాధువులు నగ్నంగానే ఉంటారు. కానీ మహిళలా నాగ సాదువులు అయితే అసలు నగ్నంగా ఉండకూడదు. సాదువులు అనే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ అమ్మాయికి పీరియడ్స్ తప్పకుండా వస్తాయి. అయితే స్త్రీ నాగ సాదువులు నగ్నంగా ఉంటారు. అసలు వీరికి పీరియడ్స్ రావా? వస్తే ఏం చేస్తారనే సందేహం మనలో చాలా మందికి ఉంది. అయితే అందరి అమ్మాయిలానే నాగ సాదువులకు పీరియడ్స్ వస్తాయి. స్త్రీ నాగ సాదువులు తప్పకుండా దుస్తులు ధరిస్తారు. కాబట్టి వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే వీరు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు ఎలాంటి పూజ ఆచరించరు. మిగతా అమ్మాయిలానే వారికి కూడా పీరియడ్స్ సాధారణం.

    మహిళలు నాగ సాధవుల్లా మారడం చాలా కష్టం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వారు నాగ సాధువులుగా మారుతారు. ఒక మహిళ నాగ సాధువుగా మారాలంటే కొన్నేళ్ల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. దాదాపుగా 6 నుంచి 12 ఏళ్ల పాటు బ్రహ్మచర్యం పాటిస్తేనే వారు నాగ సాధువులుగా మారుతారు. మగ నాగ సాధువులు నగ్నంగా ఉంటారు. సాధారణంగా బయట ప్రదేశాల్లో తిరగరు. కానీ తిరిగినా నగ్నంగానే ఉంటారు. కానీ మహిళా నాగసాధువులు మాత్రం అసలు నగ్నంగా ఉండకూడదు. కాషయ రంగులో ఉండే దుస్తులు ధరించి కుంకుమ తిలకం పెట్టుకుంటారు. అన్ని బంధాలను కూడా పూర్తిగా వదిలేయాలి. దేని మీద ఆశ ఉండకూడదు. అందం, ఆస్తి, ఆభరణాలు ఇలా దేని మీద కూడా ఆశ లేకుండా జీవించాలి. మగ నాగ సాధువులు, ఆడ నాగ సాధువులు వేర్వేరుగా ఉంటారు. ఈ ఏడాది ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనుంది. దీనికి అధిక సంఖ్యలో నాగ సాధువులు హాజరవుతారు.

    సన్యాసం తీసుకున్న మహిళలు అయిన పురుషులు అయిన అన్ని బంధాలను తీసేయాలి. దేని మీద ఆశ లేకుండా జీవించాలి. ఎక్కడ పడితే అక్కడ నివసించాలి. జీవితాన్ని తపస్సు, ధ్యానం చేయడానికి మాత్రమే అంకితం చేయాలి. తిండి, నిద్ర మీద కూడా ఆశ ఉండదు. పూజలు, ధ్యానం చేసి ఆ నిమిషానికి ఎక్కడ దొరికితే అక్కడ తినడం లేకపోతే లేదన్నట్లు ఉంటారు. నాగ సాధువులు ఎక్కువగా ఉత్తర భారత దేశంలో కనిపిస్తారు. పర్వతాలు, స్మశానంలో ఎక్కువగా నివసిస్తుంటారు. వీరు శరీరానికి బూడిత పూసుకుని ఎల్లప్పుడూ కూడా శివ నామస్మరణం చేస్తుంటారు. ఎల్లప్పుడు శివునికి పూజలు చేస్తూ ధ్యానంలోనే ఉండాలి.