https://oktelugu.com/

Job Joining Letter: ఆఫర్ లెటర్ కు మరియు అపాయింట్మెంట్ లెటర్ కు మధ్య తేడాలేంటి? ఏది అసలైనది?

ఒక కంపెనీ లేదా సంస్థ తమ జాబ్ నోటిఫికేషన్ వేసిన తరువాత ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఈ క్రమంలో కొందరికి ఆఫర్ లెటర్ జారీ చేస్తుంది. అంతే తమ కంపెనీలో జాబ్ చేయడానికి అర్హుడిగా భావిస్తూ..లెటర్ ను అందిస్తుంది. ఇందులో కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టు గానీ జాబ్ టైమింగ్స్ కానీ ఉండవు. కేవలం తమ కంపెనీలో జాబ్ ఉందని మాత్రమే తెలియ జేస్తుంది. ఈ లెటర్ ను భట్టి కంపెనీలో జాయిన్ మాత్రమే అవుతారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 22, 2023 / 02:52 PM IST

    Job Joining Letter

    Follow us on

    Job Joining Letter: చదువు పూర్తయిన తరువాత మంచి జాబ్ చేయాలని ఎవరికైనా ఉంటుంది. మంచి జీతం, అన్ని సౌకర్యాలున్న కంపెనీ కోసం ప్రయత్నాలు మొదలుపెడుతాం. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు ఉద్యోగులను నియమించుకునేందుకు యువతీ యువకులు స్టేటస్ గురించి తెలుసుకుంటాయి. జాబ్ కన్సల్టెన్సీ లేదా నేరుగా వారి గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులు తమ కంపెనీకి సరిపోతారు అని అనుకున్న తరుణంలో ఆఫర్ లెటర్లు జారీ చేస్తుంది. చాలా మంది యువత ఈ లెటర్ రాగానే అపాయింట్మెంట్ లెటర్ అని అనుకుంటారు. దీనిని ఒప్పంద పత్రంగా భావిస్తారు. కానీ ఆఫర్ లెటర్ కు, అపాయింట్మెంట్ లెటర్ కు చాలా తేడాలున్నాయి. అదేంటో తెలుసుకోండి.

    ఒక కంపెనీ లేదా సంస్థ తమ జాబ్ నోటిఫికేషన్ వేసిన తరువాత ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఈ క్రమంలో కొందరికి ఆఫర్ లెటర్ జారీ చేస్తుంది. అంతే తమ కంపెనీలో జాబ్ చేయడానికి అర్హుడిగా భావిస్తూ..లెటర్ ను అందిస్తుంది. ఇందులో కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టు గానీ జాబ్ టైమింగ్స్ కానీ ఉండవు. కేవలం తమ కంపెనీలో జాబ్ ఉందని మాత్రమే తెలియ జేస్తుంది. ఈ లెటర్ ను భట్టి కంపెనీలో జాయిన్ మాత్రమే అవుతారు.

    అయితే కంపెనీలో జాబ్ పొందిన తరువాత జాయినింగ్ సమయంలో లేదా.. కొన్ని రోజుల తరువాత అపాయింట్మెంట్ లెటర్ అందిస్తారు. ఇందులో జాబ్ వివరాలతో పాటు కంపెనీతో ఒప్పంద వివరాలు ఉంటాయి. ఇది ఉద్యోగికి, కంపెనీకి మధ్య ఉన్న అగ్రిమెంట్. భవిష్యత్ లో ఎలాంటి ఇష్యూ కైనా ఈ లెటర్ ను ప్రామాణికంగా తీసుకుంటారు. అందువల్ల జాబ్ జాయినింగ్ సమయంలో ఇచ్చేదే అసలైన అగ్రిమెంట్ అని భావించాలి.

    చాలా మంది ఈ విషయం తెలియక ఆఫర్ లెటర్ ను అగ్రిమెంట్ అనుకుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఉద్యోగులు అడగకపోయేసరికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకుండానే దాటవేస్తారు. దీంతో కంపెనీతో మీకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా అపాయింట్మెంట్ లెటర్ లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ కు తేడా తెలుసుకోండి. అంతేకాకుండా వీలైతే అపాయింట్మెంట్ లెటర్ ను తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి.