https://oktelugu.com/

Weight Loss: సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. ఈ గింజలతో ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు

సులువుగా బరువు తగ్గాలంటే తిండి మానేయడం, జిమ్ వంటివి కాకుండా బార్లీ గింజలతో ఈజీగా బరువు తగ్గవచ్చు. వీటిని ఎలా ఉపయోగిస్తే బరువు తగ్గుతారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 3, 2024 10:29 pm
    Barley Seeds Benefits

    Barley Seeds Benefits

    Follow us on

    Weight Loss: స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. కొంచెం లావుగా ఉన్నామని ఫీల్ అయ్యి.. బరువు తగ్గడానికి ప్లాన్ చేస్తుంటారు. ఈజీగా బరువు తగ్గాలని డైట్ ఫాలో కావడం, జిమ్‌కి వెళ్లడం, వాకింగ్, రన్నింగ్ వంటివి చేస్తారు. ఎన్ని నియమాలు పాటించిన కూడా కొందరు బరువు తగ్గరు. ఎందుకంటే ఈరోజుల్లో చాలా మంది ఫాస్ట్‌ఫుడ్స్ తినడం, పోషకాలు లేని పదార్థాలు తినడం వల్ల తొందరగా బరువు పెరుగుతున్నారు. బయట ఎక్కడ ఏం దొరికితే అదే తినడం వల్ల అనారోగ్యమైన కొవ్వులను శరీరంలో పెంచుకుంటున్నారు. దీనివల్ల ఊబకాయం, థైరాయిడ్ వంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇంట్లో వండిన ఫుడ్ నచ్చకపోవడం వల్ల కొందరు డైలీ బయట తినడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వర్క్ బిజీ, ఇంట్లో పనుల వల్ల బయట ఫుడ్ తింటున్నారు. తినాల్సిన బయట ఫుడ్ అంతా తినేస్తున్నారు. మళ్లీ బరువు పెరిగిన తర్వాత తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సులువుగా బరువు తగ్గాలంటే తిండి మానేయడం, జిమ్ వంటివి కాకుండా బార్లీ గింజలతో ఈజీగా బరువు తగ్గవచ్చు. వీటిని ఎలా ఉపయోగిస్తే బరువు తగ్గుతారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

     

    బార్లీ గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఈజీగా బరువు తగ్గించేలా చేయడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. బరువు తగ్గడానికి గోధుమ రొట్టె బదులు బార్లీతో చేసిన రొట్టే తీసుకోవడం ఉత్తమం. బార్లీ గింజలను పిండి చేసి చపాతీలు చేసుకుంటే స్ట్రాంగ్‌గా కూడా ఉంటారు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువ సమయం కడుపుని నిండుగా ఉంచుతాయి. దీంతో తొందరగా బరువు తగ్గుతారు. బార్లీతో చేసిన చపాతీలు తినలేమని అనుకుంటే.. దీంతో టీ కూడా చేసి తాగవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో ఈ టీని తాగితే ఈజీగా బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే ఏవైనా వ్యాధులకు మందులు వాడుతున్నట్లయితే వైద్యుని సంప్రదించిన తర్వాత బార్లీ గింజలను తీసుకోవాలి.

     

    కొందరు బరువు తగ్గాలని రాగిజావ తాగుతుంటారు. దీనికి బదులు బార్లీ పిండితో చేసిన జావ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఉదయం టిఫిన్‌గా దీన్ని తీసుకుంటే ఆరోగ్యంతో పాటు బరువు కూడా తగ్గుతారు. ఇందులో ఉండే పీచు పదార్థం తొందరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీనివల్ల మలబద్ధకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ బార్లీతో సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సూప్ శరీర ఆరోగ్యానికి బలాన్ని చేకూరుస్తుంది. ఇందులో ఉల్లిపాయలు, కొత్తమీర, చికెన్ వంటివి మీకు నచ్చినవి వేసుకుని తయారు చేసుకోవచ్చు. సాయంత్రం లేదా రాత్రి డిన్నర్ సమయాల్లో తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.