https://oktelugu.com/

Weight loss: ఈ డ్రింక్‌తో కేవలం 15 రోజుల్లోనే బరువు తగ్గవచ్చు.. ఎలా అంటే?

అమ్మాయిలు సులువుగా బరువు తగ్గాలంటే తిండి మానేయడం, జిమ్ వంటివి మాత్రమే చేయక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే డ్రింక్‌‌తో కేవలం 15 రోజుల్లోనే ఈజీగా బరువు తగ్గవచ్చు. ఎలాగో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 31, 2024 9:55 pm
    weight loss

    weight loss

    Follow us on

    Weight loss: స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. కొంచెం లావుగా ఉన్నామని ఫీల్ అయ్యి.. బరువు తగ్గడానికి ప్లాన్ చేస్తుంటారు. ఈజీగా బరువు తగ్గాలని డైట్ ఫాలో కావడం, జిమ్‌కి వెళ్లడం, వాకింగ్, రన్నింగ్ వంటివి చేస్తారు. ఎన్ని నియమాలు పాటించిన కూడా కొందరు బరువు తగ్గరు. ఎందుకంటే ఈరోజుల్లో చాలా మంది ఫాస్ట్‌ఫుడ్స్ తినడం, పోషకాలు లేని పదార్థాలు తినడం వల్ల తొందరగా బరువు పెరుగుతున్నారు. బయట ఎక్కడ ఏం దొరికితే అదే తినడం వల్ల అనారోగ్యమైన కొవ్వులను శరీరంలో పెంచుకుంటున్నారు. దీనివల్ల ఊబకాయం, థైరాయిడ్ వంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇంట్లో వండిన ఫుడ్ నచ్చకపోవడం వల్ల కొందరు డైలీ బయట తినడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వర్క్ బిజీ, ఇంట్లో పనుల వల్ల బయట ఫుడ్ తింటున్నారు. తినాల్సిన బయట ఫుడ్ అంతా తినేస్తున్నారు. మళ్లీ బరువు పెరిగిన తర్వాత తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అమ్మాయిలు సులువుగా బరువు తగ్గాలంటే తిండి మానేయడం, జిమ్ వంటివి మాత్రమే చేయక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే డ్రింక్‌‌తో కేవలం 15 రోజుల్లోనే ఈజీగా బరువు తగ్గవచ్చు. ఎలాగో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

     

    చాలా మంది ఉదయం లేచిన వెంటనే టీ, కాఫీ వంటివి తాగుతుంటారు. వాటికి బదులు ఇలాంటి డ్రింక్‌లను తాగితే ఈజీగా బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. అయితే ఎలాంటి డైటింగ్ చేయకుండా తొందరగా బరువు తగ్గాలంటే రోజూ ఉదయం లేచిన వెంటనే జీలకర్ర నీరు తాగితే తప్పకుండా బరువు తగ్గుతారట. కేవలం 15 రోజుల్లోనే దాదాపుగా 5 కిలోల వరకు బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ జీలకర్ర వాటర్ తాగడం వల్ల జీర్ణ క్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బాడీ హైడ్రేట్‌గా ఉండటానికి జీలకర్ర బాగా సహాయపడుతుంది. అలాగే వీటితో పాటు భోజనం చేసిన తర్వాత తప్పకుండా ఏదో ఒక జ్యాస్ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అందులోని ఫైబర్, కేలరీలు తొందరగా ఆకలి వేయనివ్వకుండా చేస్తుంది. దీంతో ఈజీగా బరువు తగ్గుతారు. ఉదయం లేదా సాయంత్రం కాఫీ, టీ వంటివి కాకుండా ఇలాంటి డ్రింక్‌లు తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఈ డ్రింక్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

     

    జీలకర్ర వాటర్‌ను డైలీ తాగడం వల్ల శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. డైలీ ఉదయం పరగడుపున జీలకర్ర వాటర్ తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడతారు. ఈ వాటర్ వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకంతో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే తప్పకుండా జీలకర్ర వాటర్‌ను తాగండి. దీనివల్ల మీరు తొందరగా విముక్తి పొందుతారు. అలాగే మధుమేహం ఉన్నవారికి కూడా జీలకర్ర వాటర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులోని వాటర్ రక్తంలోన చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే అధిక రక్తపోటు సమస్యలను కూడా తగ్గిస్తుంది. డైలీ ఈ వాటర్ తాగం వల్ల శరీరంలో హార్మోన్ల సంతులనం మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి డైలీ కాఫీ, టీకి బదులు ఈ వాటర్ తాగడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.