Weight Loss: ఈ లడ్డు బరువును వేగంగా తగ్గిస్తుంది.. ఎలా తయారు చేసుకోవాలంటే?

అవిసె గింజల గురించి చాలా మంది వినే ఉంటారు. వీటి వల్ల బరువు తగ్గుతారు. వీటిని వివిధ పద్ధతుల్లో తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పూర్తిగా మాయమవుతుంది. అయితే అలా చేయడం కొందరకి కష్టతరమే అవుతుంది. వీటితో రుచికరమైన ఆహార పదార్థం తయారు చేసుకొని తినడం వల్ల మనసుకు తృప్తి అవుతుంది.

Written By: Chai Muchhata, Updated On : April 23, 2024 1:32 pm

Flax seed Laddu

Follow us on

Weight Loss:  కరోనా తరువాత గుండె సమస్యలు అధికం అయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురైన మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ మరణాలకు కారణం ఏవైనా శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉండడం కూడా ఓ కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో కొవ్వును కరిగించుకునేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. కొందరు కఠోర వ్యాయామాలు చేయడం వల్ల మొదటికే మోసం అవుతుంది. ఈ నేపథ్యంలో నాణ్యమైన ఆహారం తీసుకోవడంతోనూ కొవ్వును కరిగించుకోవచ్చు. ఈ ఆహారం కోసం ఎక్కడికో వెళ్లకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంతకీ ఆ ఆహారం ఏంటిది? దానిని ఎలా తయారు చేసుకుంటారు?

గుండు సమస్యలు ఎక్కువవుతున్న నేపథ్యంలో చాలా మంది ఆరోగ్య టిప్స్ పాటిస్తున్నారు. కానీ కొన్ని ఆహార పదార్థాల్లో పోషకాలు ఉన్నా ఇవి ఫ్యాట్ ను తగ్గించడంలో సహకరించవు. దీంతో బరువు పెరుగుతున్నారు. ఫలితంగా కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మరికొన్ని నేచురల్ ఫుడ్ తీసుకునే క్రమంలో టేస్టీని కోల్పోతున్నారు. దీంతో మనసుకు తృప్తి కావడం లేదు. అయితే కొలెస్ట్రాల్ ను కరిగించడమే కాకుండా కొత్త కొలెస్ట్రాల్ ను రాకుండా చేసే ఓ పదార్థాన్ని తయారు చేసుకోవచ్చ . ఇది రుచిని ఇవ్వడమే కాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.

అవిసె గింజల గురించి చాలా మంది వినే ఉంటారు. వీటి వల్ల బరువు తగ్గుతారు. వీటిని వివిధ పద్ధతుల్లో తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పూర్తిగా మాయమవుతుంది. అయితే అలా చేయడం కొందరకి కష్టతరమే అవుతుంది. వీటితో రుచికరమైన ఆహార పదార్థం తయారు చేసుకొని తినడం వల్ల మనసుకు తృప్తి అవుతుంది. అలాగే నాణ్యమైన ఆహారాన్ని తీసుకున్నవాళ్లమవుతాం. ఈ పదార్థం కోసం అవిసె గింజలను తీసుకొని వేయించుకోవాలి. ఆ తరువాత విత్తనాలు తీసేసిన ఖర్చూర ముక్కలను తీసుకొని అందులో కాస్త తేనె కలపాలి. దీనిని కాసేపు వేడి చేయాలి. ఆ తరువాత అందులో అవిసు గింజలు వేయాలి. ఈ మిశ్రమాన్ని అడ్డూ లాగా తయారు చేసుకొని రోజుకి ఒకటి చొప్పున తినవచ్చు.

అవిసె గింజల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇందులో అల్ఫాలిలో లెనిక్ యాసిడ్ ఉంటుంది. దాదాపు 30 రోజుల పాటు అవిసె గింజలను ఏదో రకంగా తీసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ ద్వారా వచ్చే వ్యాధులు కంట్రోల్ అయ్యాయని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండడానికి అవిసెగింజలు ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు.