https://oktelugu.com/

Weight Loss: ఈజీగా బరువు తగ్గాలంటే.. 20-10 రూల్ పాటించాల్సిందే!

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా బరువు తగ్గాలంటే 20-10 రూల్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ 20-10 రూల్ అంటే ఏమిటి? ఎలా పాటిస్తే బరువు తగ్గుతారో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 15, 2024 / 01:20 AM IST

    weight loss

    Follow us on

    Weight Loss: స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. ఎక్కువ బరువుగా, మరీ సన్నగా ఉండకుండా కరెక్ట్ సైజ్‌లో ఉండాలని కోరుకుంటారు. దీంతో కాస్త ఎక్కువ బరువుగా ఉన్నా చాలు.. తగ్గడానికి ప్లాన్ చేస్తుంటారు. ఈజీగా బరువు తగ్గాలని డైట్ ఫాలో కావడం, జిమ్‌కి వెళ్లడం, వాకింగ్, రన్నింగ్ వంటివి చేస్తారు. ఎన్ని నియమాలు చేసిన బరువు తగ్గరు. ఎందుకంటే ఈరోజుల్లో చాలా మంది ఫాస్ట్‌ఫుడ్స్ తినడం, పోషకాలు లేని పదార్థాలు తినడం వల్ల తొందరగా బరువు పెరుగుతున్నారు. బయట ఫుడ్ తినడం వల్ల ఊబకాయం, థైరాయిడ్ వంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలా తినడం వల్ల మళ్లీ బరువు పెరుగుతారు. ఆ తర్వాత తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా బరువు తగ్గాలంటే 20-10 రూల్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ 20-10 రూల్ అంటే ఏమిటి? ఎలా పాటిస్తే బరువు తగ్గుతారో ఈ స్టోరీలో చూద్దాం.

     

    ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఆహారం ఎంత ముఖ్యమో.. వ్యాయామం కూడా అంతే ముఖ్యం. కొందరు ఫుల్‌గా తింటారు. కానీ వ్యాయామం చేయరు. తినే ఫుడ్‌కి సరిపడా వ్యాయామం చేస్తేనే ఈజీగా బరువు తగ్గుతారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా 20-10 రూల్ పాటించాలని నిపుణులు అంటున్నారు. ఈ రూల్‌లో రోజుకి 20 నిమిషాల పాటు వ్యాయామం చేయడంతో పాటు దానికి పది నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఈ రూల్ పాటించడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతుంటారు. రోజూ 20 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఉండే కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో తొందరగా బరువు తగ్గుతారు. ఆ తర్వాత సరిగ్గా పది నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం వల్ల గుండె సమస్యలు అన్ని క్లియర్ కావడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. ఈ విధానం పాటించడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.

    వ్యాయామం చేయడం వల్ల కేవలం బరువు మాత్రమే తగ్గడమే కాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. రోజూ వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. దీనివల్ల బోలు ఎముకల వ్యాధి వంటివి రాకుండా వ్యాయామం కాపాడుతుంది. అలాగే వ్యక్తిగత కారణాలు, వర్క్ వల్ల చాలా మంది ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నట్లయితే విముక్తి పొందుతారు. వ్యాయామం చేయడం వల్ల మెదడు ఆలోచన శక్తి మెరుగుపడటం, నిద్రలేమి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఎక్కువగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు డైలీ వ్యాయామం చేయడం వల్ల మానసిక సమస్యల నుంచి బయట పడతారని నిపుణులు చెబుతున్నారు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.