https://oktelugu.com/

Weight Gain Foods: నాన్ వెజ్ అవసరం లేకుండా కండలు పెంచే ఆహార పదార్థాలు ఏవో తెలుసా?

సాధారణ రైస్ కంటే కొంచెం బ్రౌన్ రైస్ కాస్త భిన్నంగా కనిపిస్తాయి. రుచిలోనూ తేడా ఉంటుంది. కానీ బ్రౌన్ రైస్ లో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 1, 2023 / 05:24 PM IST

    Weight Gain Foods

    Follow us on

    Weight Gain Foods: ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కిరికి ఉంటుంది. మగవాళ్లలో కొందరు ఫిట్ గా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం డైలీ వర్కౌట్లు చేస్తారు. కొందరు ప్రత్యేకంగా జిమ్ సెంటర్లకు వెళ్తుండగా..మరికొందరు ఇంట్లోనే ఐటమ్స్ తో వ్యాయామం చేస్తారు. అయితే వర్కౌట్లు చేసినప్పుడు శరీరం నుంచి అధిక శక్తి విడుదలవుతుంది. దీంతో ఆహారాన్ని కోరుతుంది. ఈ సమయంలో నాన్ వెజ్ తింటే కండలు పెరుగుతాయని కొందరు భావిస్తారు. ఈ క్రమంలో చాలా మంది నాన్ వెజ్ ఫుడ్ తీసుకుంటారు. కానీ వెజ్ లోనూ కండలు పెంచేఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు ఉన్నాయి.వర్కౌట్ చేస్తు ఇవి తీసుకుంటే కండలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకుందామా..

    పనీర్:
    దీనిని పాలతో తయారు చేస్తారు. పాల విరుగుడును మస్లిన్ లేదా జున్ను గుడ్డలో ఆరబెట్టిన తరువాత నీరు తొలిగిపోయి పనీర్ తయారవుతుంది. పనీర్ తో ఇతర కర్రీలు తయారు చేసుకుంటారు. రసనమలై లాంటి స్వీట్స్ ను తయారు చేస్తారు. పనీర్ లో ప్రోటీన్ 7.54 గ్రాములు ఉంటుంది. కాల్సియం 190.4 మిల్లీ గ్రాములు ఉంటుంది. ఇందులోవిటమిన్ బీ 12, విటమిన్ డీ, రైబోప్లేవిన్ సమృద్దిగా ఉంటాయి. ఒక గుడ్డు కంటే ఎక్కువగా ఇందులో ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల ఇది కండరాల పెరుగుదలకు సహాయ పడుతుంది.

    పప్పు దినుసులు:
    నాన్ వెజ్ తినని వారు పప్పు దినుసులు అధికంగా తినాలి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. కందిపప్పు, పెసరపప్పు లాంటివి కర్రీలు చేసుకొని ఎక్కువగా తినడం వల్ల వ్యాయామం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది.

    బ్రౌన్ రౌస్:
    సాధారణ రైస్ కంటే కొంచెం బ్రౌన్ రైస్ కాస్త భిన్నంగా కనిపిస్తాయి. రుచిలోనూ తేడా ఉంటుంది. కానీ బ్రౌన్ రైస్ లో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది. వర్కౌట్లు చేస్తూ బ్రౌన్ రైస్ తీసుకుంటే కండరాలు గట్టిగా మారుతాయి. ఫలితంగా జిమ్ చేసేవారికి సహకరిస్తుంది.

    క్వినోవా:
    బరువు తగ్గడానికి బెస్ట్ ఆప్షన్ క్వినోవా. ఇదే సమయంలో వ్యాయామం చేసేవారు వివిధ పద్ధతుల్లో క్వినోవాను తీసుకుంటే ఎనర్జీ వస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వ్యాయామం చేసేవారికి ఇది మంచి ఫుడ్.

    పాలకూర:
    పలు సందర్భాల్లో పాల కూర కర్రీని తీసుకుంటారు. కానీ ఎక్కువగా తీసుకోవడానికి ఇష్డపడరు. అయితే జిమ్ చేసేవారు ఇది తీసుకుంటే కండలు పెరుగుతాయి. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది.

    గ్రీక్ యోగర్ట్:
    పాల ఉత్పత్తుల్లో ఒకటైన గ్రీక్ యోగర్డ్ మంచి పోషకాలు ఇచ్చే ఆహారం. దీనిని వ్యాయామం చేసేటప్పుడు తీసుకోవడం ద్వారా ఎనర్జీ ఎక్కువగా వస్తుంది.