Wedding Night ; పెళ్లి అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి అనుభూతి. ఆ తరువాత జరిగే కార్యం మధురానుభూతిని ఇస్తుంది. చాలా మంది యువత పెళ్లి తరువాత జరిగే శోభనంపై ఉత్సాహంగా ఉంటారు. దీనిపై ఎన్నో కలలు కంటారు. పెళ్లి తరువాత మూడు రాత్రులు ఎంజాయ్ చేయాలని కొందరు అనుకుంటారు. కానీ ఈ మూడు రోజులు కొందరు ఎంజాయ్ చేస్తే..మరికొందరికి నిరాశే కలుగుతుంది. ఏదీ ఏమైనా ఒక ప్రదేశంలో మాత్రం ఈ మూడు రాత్రులు నరకంలా భావిస్తారట. ఓ ప్రాంతంలో ఈ మూడు రాత్రుళ్లు వారికి మధురానుభూతి దెవుడెరుగు.. ఆ రోజులు ఎప్పుడు గడుస్తాయా? అని బాధపడుతారట. ఇంతకీ అసలు విషయం ఏంటంటే?
ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జీవించేవారు విభిన్న ఆచారాలను పాటిస్తారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో కొన్ని ప్రాంతాల ప్రజలు ఆచరించేవి చాలా విచిత్రంగా ఉంటాయి. భారతదేశంలో పెళ్లి తరువాత వచ్చే ఈ మూడు రోజులను ప్రత్యేక ప్రదేశానికి వెళ్లి ఎంజాయ్ చేస్తారు. మరికొందరు మాత్రం ఇంట్లోనే ఉంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ ఓ దేశంలో మాత్రం చాల విచిత్రంగా గడుపుతారు. ఈ మూడు రాత్రుళ్లూ వారు మూత్రం చేయొద్దట..
బోర్నియా ఐలాండ్ ఆసియాలోనే పెద్ద దీవి. సమత్రా దీవులకు తూర్పు భాగంలో ఉన్న ఈ ఐలాండ్ ను ఇప్పటి వరకు ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. కానీ దీనిపై ఇండోనేషియా, బ్రూనై, మలేషియా దేశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇక్కడి ప్రాంతం పర్యాటకంగా ప్రసిద్ధి చెందింది. కానీ ఇక్కడి ప్రజలు పాటించే ఆచారాలు విచిత్రంగా ఉన్నాయి. ఇక్కడ పెళ్లయిన వారిని శోభనం చేసుకునేందుక మూడు రాత్రుళ్లు ఒకే గదిలో బంధిస్తారట.
ఇలా బంధించడం వల్ల ఎంజాయ్ చేయచ్చు అని కొందరు యువత అనుకోవచ్చు. కానీ అంత అవకాశం ఇవ్వరు. ఎందుకంటే ఈ గదిలోకి వెళ్లిన వారు కనీసం మూత్రం చేయొద్దట. మల విసర్జనకు కూడా అవకాశం ఇవ్వరట. అయితే శోభనం మాత్రం చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. అలా ఎలా సాధ్యం అని అనుకోవచ్చు. అయితే కొందరు పూర్వీకులు పెళ్లయిన తరువాత తమ పిల్లలు వరుసగా చనిపోవడం వల్ల ఇలా కొత్త ఆచారాన్ని ఏర్పాటు చేశారట. ఇలా చేయడం వల్ల వారి జీవితం సంతోషంగా ఉంటుందని భావిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల అనారోగ్యానికి గురవుతారని వైద్యులు చెబుతున్నారు.