Water Chestnut: ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు మార్కెట్లో చాలా ఉంటాయి. పండ్లును డైలీ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలా మందికి మార్కెట్లో దొరికే కొన్ని పండ్ల గురించి పెద్దగా తెలియదు. అలాంటి వాటిలో వాటర్ చెస్ట్‌నట్ ఒకటి. బీట్‌రూట్ రంగు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. ఈ వాటర్ చెస్ట్‌నట్ వల్ల చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తాయి. అలాగే ఇందులోని కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం, ఖనిజాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే ఈ పండును ఆరోగ్యానికి మేలు చేసిన కూడా.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తినకూడదని వైద్య నిపుణులు అంటున్నారు. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ పండు సీజనల్‌గా మాత్రమే దొరుకుతుంది. ఇలాంటి పండు అసలు ఏ అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదు. తింటే ఏమవుతుందో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వాటర్ చెస్ట్ నట్ పండ్లు ఆరోగ్యానికి మంచివే. కానీ మలబద్ధకం ఉన్నవారు అసలు వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. మలబద్ధకం ఉన్నవాళ్లు వీటిని తీసుకోవడం వల్ల సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే చిన్నపిల్లలకు ఈ పండ్లు చాలా తక్కువ మోతాదులో ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు పైన ఉండే తొక్క తీసి ఇవ్వాలి. లేకపోతే ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు బారిన పడతారు. కొందరు జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు వాటర్ చెస్ట్‌నట్‌లను తినడం వల్ల సరిగ్గా జీర్ణం కాదు. కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తినకపోవడం బెటర్. అలాగే కాలేయ సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా వాటర్ చెస్ట్ నట్‌కి దూరంగా ఉండాలి. దీనిని తినడం వల్ల కాలేయం ప్రమాదంలో పడుతుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు అసలు వీటిని తీసుకోకూడదు. ఎందుకంటే దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి.
జలుబు, దగ్గుతో ఇబ్బంది పడేవారు ఈ పండును తినకూడదు. ఒకేవేళ తింటే సమస్య తగ్గకుండా పెరుగుతుంది. ఎక్కువ మొత్తంలో వాటర్ చెస్ట్‌నట్ తినడం వల్ల కడుపు సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వాటర్ చెస్ట్‌నట్‌లను ఎక్కువగా తినడం వల్ల కొందరు కడుపు నొప్పి వస్తుంది. ఎందుకంటే కొందరు పచ్చిగా ఉన్నప్పుడు తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు, వాంతులు, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.