Health Tips: మనకు చెడు అలవాట్లు తొందరగా అబ్బుతాయి. మంచి అలవాట్లు అంత తేలిగ్గా అలవాటు కావు. దీంతో జీవితం నాశనం కావడానికి చెడు అలవాట్లే ప్రధాన కారణం అని తెలిసినా వాటిని మానలేరు. మందు తాగడం మంచి అలవాటు కాదని తెలిసినా దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇదే కోవలో అశ్లీల చిత్రాలు చూడటం కూడా ఓ వ్యసనమే. దీనికి చాలా మంది ఆకర్షితులవుతున్నారు. దీంతో తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. అశ్లీల చిత్రాలు చూడటం బానసత్వమే. దానికి మనం అడిక్ట్ అయిపోతే ఇక ఏం చేయలేం. సందు దొరికితే చాలు సైట్లు ఓపెన్ చేసుకుని వాటిని చూస్తూ టైంపాస్ చేయడమే.

దీంతో ఎన్నో అనర్థాలు ఉన్నాయి. సమయం వృథా అయిపోతోంది. ఏ పని చేయాలన్నా ఆలోచనలు ముందుకు సాగవు. మనసంతా వాటి మీదే ఉంటుంది. దీంతో మన లక్ష్యం కాస్త నీరుగారిపోతుంది. భవిష్యత్ అంధకారమే అవుతుంది. అయినా చాలా మంది వీటికే బానసలుగా మారుతున్నారు. సమాజంలో దాదాపు తొంబై శాతం మంది అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని చూడటమే వ్యసనంగా మార్చుకున్న వారు సైతం ఉండటం గమనార్హం.
రోజులో ఎక్కువ భాగం వాటిని చూడాలన్న ధ్యాసలోనే గడిచిపోతోంది. మిగతా విషయాలపై అంత శ్రద్ధ ఉండదు. కానీ సంసారం, జీవితం రెండు చెల్లాచెదురైపోతాయి. ఇలాంటి వీడియోలు చూడటం అలవాటుగా మారిన వారు దాని నుంచి బయటపడాలంటే చాలా కష్టమే. బానిసత్వం నుంచి బయటకు రావాలంటే దానికి కఠోర శ్రమ కావాలి. అప్పుడే వాటిని దూరం చేసుకోవచ్చు. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఫోన్ లో ఆ వీడియోలు, సైట్లు ఓపెన్ కాకుండా చూసుకోవాలి. ఇంకా ఏవైనా మంచి ఆప్స్ ను ఉపయోగించుకుని వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

అశ్లీల వీడియోలు చూడకుండా ఉండేందుకు వాటికి బదులు ఇతర వీడియోలు చూసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. కొద్ది రోజులు మానేశాక మళ్లీ అటు వైపు దృష్టి పోకుండా జాగ్రత్త పడాలి. ఒకసారి అటు వైపు దృష్టి మళ్లిందంటే ఇక అంతేసంగతి. అది అలవాటుగా మారిపోతోంది. వీలైనంత వరకు ఒంటరిగా ఉండొద్దు. స్నేహితులతోనో, కుటుంబంతోనో ఎక్కువ కాలం గడిపితే అలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఏం చేసినా వాటి నుంచి బయటపడకుండా ఉంటే డాక్టర్ ను సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోవడం ఉత్తమం.