Washing Machine: ఈ రోజుల్లో అందరూ కూడా లగ్జరీ లైఫ్‌లో బాగా అలవాటు పడ్డారు. ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా అన్ని పనులు అయ్యే విధంగా చూస్తున్నారు. ఇంట్లో వంట, సామానులు క్లిన్ చేయడం, బట్టలు ఉతకడం ఇలా అన్నింట్లో కూడా సులువు పద్ధతి కోసం చూస్తున్నారు. ప్రస్తుతం అందరూ కూడా వాషింగ్ మెషీన్స్ వాడుతుంటారు. బట్టలు ఉతకడానికి సమయం లేకపోవడం, ఓపిక లేకపోవడం వల్ల చాలా మంది తప్పకుండా వాషింగ్ మెషీన్‌లు వాడుతున్నారు. వీటిలో బట్టలు వేస్తే ఆటోమేటిక్‌గా డ్రై కూడా అయిపోతాయి. ఏదో కొంత సమయం బయట ఆరబెడితే చాలు ఆరిపోతాయి. అయితే వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొందరు తెలియక చేసిన చిన్న తప్పులు వల్ల బట్టలు తొందరగా పాడైపోతాయి. ఈజీగా వాషింగ్ మిషన్‌లో అయిపోతాయని ఇందులో వేస్తుంటారు. కానీ తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల దుస్తులు పాడవడంతో పాటు వాషింగ్ మెషీన్ కూడా దెబ్బతింటుంది. ఇలా కాకుండా ఉండాలంటే వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికేటప్పుడు అసలు ఈ మిస్టేక్స్ చేయకూడదు. మరి చేయకూడని ఆ తప్పులేంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం.
సాధారణంగా వాషింగ్ మెషీన్‌లో ఒక ఆరు జతల వరకు మాత్రమే దుస్తులు పడతాయి. కొందరు ఒక్కసారికే అయిపోతాయని ఒక్క డ్రస్ అని వేసేస్తారు. వాషింగ్ మెషీన్ లిమిట్ కంటే ఎక్కువగా బట్టలు వేయడం వల్ల మెషీన్ ఒక్కసారిగా ఓవర్ లోడ్ అవుతుంది. దీంతో మెషీన్ పాడవడంతో పాటు బట్టలు కూడా సరిగ్గా వాష్ కావు. అందులోని మురికి పోకుండా అలా ఉండిపోతుంది. దీనివల్ల కొన్నిసార్లు మోటార్ పోతుంది. కాబట్టి ఒకేసారి ఎక్కువ బట్టలు వేయవద్దు. అవసరమైతే ఇంకో రెండు సార్లు వేసుకోండి. దీనివల్ల దుస్తులు పాడవ్వకుండా ఉండటంతో పాటు మెషీన్ కూడా మంచిగా ఉంటుంది.
వాషింగ్ మెషీన్ కదలకుండా ఉండే విధంగా ఉంచాలి. ఒకే ఉపరితలంపై సమానంగా ఉండేలా వాషింగ్ మెషీన్‌ను పెంచుకోవాలి. లేకపోతే మిషన్ కదిలేటప్పుడు కొన్నిసార్లు పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాషింగ్ మెషీన్ సరైన ప్లేస్‌లో ఉండేలా చూసుకోండి. అలాగే కొన్ని రకాల దుస్తులను వాషింగ్ మెషీన్‌లో అసలు వేయకూడదు. ఇలా వేయడం వల్ల బట్టలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే బట్టలు వేసేటప్పుడు అన్ని రంగుల దుస్తులు వేయకూడదు. దీనివల్ల కొన్ని రకాల దుస్తుల రంగులు మిగతా బట్టలకు అంటుకుంటాయి. కాబట్టి రంగు అంటుకునే బట్టలు అన్ని కలిపి ఒక్కసారి వేయవద్దు. అలాగే వాషింగ్ మెషీన్‌కు కవర్ కూడా వాడండి. లేకపోతే వాషింగ్ మెషీన్ దుమ్ము, ధూళితో నిండిపోతుంది. దీంతో తొందరగా అది పాడైపోతుంది. కాబట్టి వాషింగ్ మెషీన్ విషయంలో ఈ మిస్టేక్స్ అసలు చేయవద్దు.