Gold Investment: బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈరోజు ఉన్న రేటు రేపటికల్లా అమాంతం పెరుగుతుంది. దీంతో గోల్డ్ ప్రియులు తక్కువ రేటు ఉన్నప్పుడే బంగారాన్ని కొని పెట్టుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ఆర్నమెంట్స్ ను కొనుగోలు చేసి భద్రపరుచుకోవాలని చూస్తారు. భవిష్యత్ లో బంగారం ధర పెరిగితే వీటిని అమ్మడం వల్ల భారీ లాభాలు పొందవచ్చని చూస్తున్నారు. బంగారంపై ప్రత్యేకంగా పెట్టుబడి పెడితే కొందరికి కలిసి వస్తుందని దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. అయితే బంగారు ఆభరణాలపై ఇన్వెస్ట్ మెంట్ చేస్తే లాభం కంటే నష్టమే ఉంటుందని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆభరణాలపై పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అంటున్నారు. ఇంతకీ బంగారంపై ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎంత లాభం వస్తుంది? అనే వివరాల్లోకి వెళితే..
అక్షయ తృతీయ సందర్భంగా చాలా మంది బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. పిసరంత బంగారాన్ని దక్కించుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో బంగారం ధరలు ఆ సమయంలో విపరీతంగా పెరుగుతాయి. మరికొంతమంది ప్రత్యేక రోజుల్లో కాకుండా సాధారణ రోజుల్లో బంగారం కొనుగోలు చేసి భద్రపరుచుకోవాలని చూస్తారు. భవిష్యత్ తో బంగారం ధర పెరిగితే ఎక్కువ లాభాలు వస్తాయని అనుకుంటారు. కానీ బంగారం బిస్కెట్లు లేదా ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు వీటిపై మేకింగ్ చార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్, జీఎస్టీలు అదనంగా వేస్తారు. దీంతో బంగారం ధర కంటే చార్జీలపై కూడా ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది.
మరి బంగారంపై ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి? అంటే దీనికో మార్గం ఉంది. ప్రభుత్వం ఆమోదించిన ‘సావెరిన్ గోల్డ్’ను కొనుగోలు చేయడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఈ గోల్డ్ ను కొనుగోలు చేయడం వల్ల ఒక బాండ్ ఇస్తారు. బంగారం ధరలు పెరిగినప్పుడు కొనుగోలు చేసిన గోల్డ్ పై ధరలు పెరుగుతాయి. అలాగే సంవత్సరానికి దీనిపై 2.5 శాతం వడ్డీని కూడా చెల్లిస్తుంది.
అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేవారికి మాత్రమే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెడితే 8 సంవత్సరాల వరకు తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఫెనాల్టీ చార్జీలు భరించాలనుకుంటే మాత్రం ఈ మొత్తాన్ని తీసుకోవచ్చు. కానీ ఈ గోల్డ్ ను కొనుగోలు చేయడం ద్వారా సెక్యూర్ గా ఉండడంతో పాటు అత్యధిక లాభాలు వస్తాయి. ఈ బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు సావెరిన్ గోల్డ్ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.