https://oktelugu.com/

గురక నుంచి విముక్తి చెందాలా? అయితే ఈ చిట్కాలు పాటించేయండిలా!

రాత్రంతా ఎక్కువ సమయం గురక పెడుతూనే ఉంటారు. ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా గురకను తగ్గించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు. మరి గురకను తగ్గించుకోవడానికి పాటించాల్సిన ఆ చిట్కాలేంటో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 22, 2024 8:53 pm
    snoring

    snoring

    Follow us on

    మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యం. బాడీకి సరిపడా నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఒక్కరోజు నిద్రలేకపోయిన బాడీలో నీరసం అన్ని వస్తాయి. ఏ పని మీద కూడా అంతగా దృష్టి పెట్టలేరు. రోజంతా అలసటగా ఉంటుంది. అయితే కొందరికి గురక పెట్టే అలవాటు ఉంటుంది. దీనివల్ల వారు హాయిగా పడుకున్న చుట్టుపక్కల ఉన్నవారు మాత్రం పడుకోరు. ఎందుకంటే గురక పెట్టేవారికి తెలీదు. కానీ మిగతా వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ గురక మీద చాలా సినిమాలు వచ్చాయి. పార్ట్‌నర్ గురక పెట్టడం వల్ల ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. కొందరికి ఏదో కాస్త సమయం గురక పెడతారు. కానీ మరికొందరు మాత్రం రాత్రంతా ఎక్కువ సమయం గురక పెడుతూనే ఉంటారు. పొరపాటున పది నిమిషాలు నిద్రపోయిన కూడా గురక పెడతారు. అయితే ఈ సమస్య ఎక్కువ అయితే ప్రమాదమే అని నిపుణులు అంటున్నారు. ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా గురకను తగ్గించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు. మరి గురకను తగ్గించుకోవడానికి పాటించాల్సిన ఆ చిట్కాలేంటో చూద్దాం.

    దాల్చిన చెక్క
    ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో దాల్చిన చెక్క ఒకటి. దీనిని తినడం వల్ల బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. డైలీ డైట్‌లో దాల్చిన చెక్క పొడిని తీసుకుంటే మహిళలకు పీరియడ్స్ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అయితే ఈ దాల్చిన చెక్కతో గురక సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తొందరగా గురక సమస్య నుంచి విముక్తి కలిగిస్తాయి. దాల్చిన చెక్కను పొడి చేసుకుని నిల్వ చేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు ఈ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే గురక పెట్టడం ఆపేస్తారు. డైలీ ఇలా చేయడం వల్ల రోజురోజుకీ మీరు గురక పెట్టడం మానేస్తారు. ఈ పొడి నీరు తాగడం వల్ల హాయిగా నిద్రపోతారు.

    పుదీనా నీరు
    గురకతో బాగా ఇబ్బంది పడుతున్నట్లయితే.. పుదీనా నీరు బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు గురక నుంచి బయట పడేలా చేస్తాయి. తాజా పుదీనా ఆకులను తీసుకుని ఒక గ్లాసు‌ నీటిలో మరగించాలి. చల్లారిన తర్వాత ఈ నీటిని వడబోసుకుని తాగాలి. నిద్రపోయే ముందు ఈ నీటిని తాగడం వల్ల గురక నుంచి తొందరగా బయట పడతారు. పుదీనా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తాయి. కాబట్టి నిద్రపోయే ముందు తప్పకుండా పుదీనా నీరు తయారు చేసుకుని తాగడం మేలు.

    వెల్లుల్లి
    ఎన్నో పోషకాలు ఉండే వెల్లుల్లిని తీసుకోవడం వల్ల గురక తొందరగా తగ్గుతుంది. గురకను తగ్గించడంలో వెల్లుల్లి రెబ్బలు బాగా పనిచేస్తాయి. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని.. గోరువెచ్చని నీటిలో వేయాలి. ఇవి బాగా కలిసిన తర్వాత ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే గురక సమస్య తగ్గుతుంది. అలాగే వెల్లుల్లిని వంటల్లో కూడా ఎక్కువగా వాడుతారు. కానీ చాలా మంది వీటిని తినకుండా పడేస్తుంటారు. అలా పడేయకుండా తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి అనారోగ్య సమస్యల బారి నుంచి కాపాడటంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. కొందరు ఉదయం పూట వీటిని తింటుంటారు. ఇలా తినడం వల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరవని భావిస్తారు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.