https://oktelugu.com/

Walking: వారానికి ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసా?

ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ చేయాల్సిన మొదటి పని నడవడం. ముఖ్యంగా రోజంతా శారీరక శ్రమ లేకుండా కూర్చొన్న వారు తప్పకుండా వాకింగ్ చేయాలి. రోజూ వాకింగ్ చేసేంత సమయం లేకపోతే వారానికి అయిన చేయాలి. మరి ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఎన్ని అడుగుల వేయాలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 20, 2024 / 06:27 AM IST

    Walking

    Follow us on

    Walking: ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ చేయాల్సిన మొదటి పని నడవడం. రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతుంటారు. అయిన కూడా కొందరు వాకింగ్ చేయరు. వాకింగ్ చేసేంత సమయం లేకపోయిన కనీసం షాప్‌కి వెళ్లినప్పుడు కూడా కాలినడకన వెళ్లరు. సుఖానికి అలవాటు పడటం వల్ల శారీరక శ్రమ పూర్తి లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. కనీసం వారానికి ఒకసారి కూడా వ్యాయామం చేయడం లేదు. ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలంటే వాకింగ్ అనేది తప్పనిసరి. గుండె సమస్యలతో పాటు స్థూలకాయం, అధిక రక్త పోటు, డయాబెటిస్, డిప్రెషన్ వంటివి సమస్యలు కూడా దరిచేరవు. చాలా మంది ఉద్యోగాలు చేస్తూ.. రోజంతా కంప్యూటర్ల ముందు కుర్చుంటున్నారు. దీంతో మలబద్దకం, ఊబకాయం వంటి సమస్యల బారిన పడుతున్నారు. రోజంతా శారీరక శ్రమ లేకుండా కూర్చొన్న వారు తప్పకుండా వాకింగ్ చేయాలి. రోజూ వాకింగ్ చేసేంత సమయం లేకపోతే వారానికి అయిన చేయాలి. మరి ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఎన్ని అడుగుల వేయాలో చూద్దాం.

     

    రోజూ నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయలేని వారు వారానికి కనీసం అయిన పదివేల అడుగులు వేయాలి. రోజంతా శారీరక శ్రమ ఉన్నవారు తక్కువగా నడిచి పర్లేదు. కానీ ఎలాంటి శారీరక శ్రమ లేని వారు ఇంతకంటే ఎక్కువగానే నడవాలి. ఇలా నడవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్‌గా కూడా ఉంటారు. ఒత్తిడి, ఆందోళన నుంచి విముక్తి చెందుతారు. వారానికి అయిన ఇలా నడవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో వివిధ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి వాకింగ్ బాగా ఉపయోగపడుతుంది. మధుమేహం ఉన్నవారు ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. వీటితో పాటు వయస్సు పెరిగిన కాస్త యంగ్‌గానే కనిపిస్తారు.

     

    వృద్ధులు, చిన్న పిల్లలతో పోలిస్తే వయస్సులో ఉన్నవారు కాస్త ఎక్కువగా వాకింగ్ చేయాలి. 18 నుంచి 40 ఏళ్లు మధ్య వారు రోజూ తప్పకుండా 12 వేల అడుగులు నడవాలి. అయితే రోజూ నడవడం కుదరని వాళ్లు కనీసం వారానికి అయిన నడవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు రోజుకి కనీసం 15 వేల అడుగులు అయిన వేయాలి. 50 ఏళ్లు పైబడిన వారు 10 వేల అడుగులు నడవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. డైలీ వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఎక్కువ సంవత్సరాలు బతికే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి సమయం లేకపోయిన వీలు చూసుకుని అయిన కూడా రోజూ వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.