Sleep Tips: మనకు తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే. రెండింటిలో ఏది లోపించినా ఆరోగ్యం దెబ్బ తింటుంది. అందుకే రెంటికి సమప్రాధాన్యం ఇవ్వాలి. నోరు ఉంది కదాని రాత్రుళ్లు తింటూ కూర్చుంటే ఆరోగ్యం పాడైపోతోంది. అందుకే తినడానికి పడుకోవడానికి సమయం కేటాయించుకోవాలి. తినే సమయంలో పడుకోకూడదు. పడుకునే సమయంలో తినకూడదు. ఈ నిబంధనలు పాటించకపోతే అంతే. అందుకే వైద్యులు చెబుతున్నారు. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్ర పోవాలని సూచిస్తున్నారు. అయినా కొంత మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో రోగాల బారిన పడుతున్నారు. ఫలితంగా రూ. లక్షలు దవాఖానాల్లో పోస్తున్నారు.

రాత్రి పడుకున్నామంటే తెల్లవారే వరకు నిద్ర నుంచి లేవకూడదు. అలాగైతేనే మంచి నిద్ర పట్టినట్లు. ఇక నిద్రలో ఊరికే మెలకువ వస్తే నిద్ర భంగం అవుతుంది. ఇలాంటి సమస్య ఉన్న వారు జాగ్రత్త పడాల్సిందే. మధుమేహం ఉన్న వారికి మూత్రం వస్తుంది. వారు లేవాల్సిందే. కానీ ఏ జబ్బులు లేనివారు ఊరకే నిద్రలో నుంచి లేచి కూర్చుంటుంటారు. ఇది మంచి అలవాటు కాదు. నిద్ర నుంచి లేవకూడదు. అలాగే పడుకుంటే మనకు ఎన్నో లాభాలు వస్తాయి. దీంతో నిద్ర పోయేందుకు అనువుగా గదిని సిద్ధం చేసుకోవాలి.
గదిలో వెలుతురు ఉండకూడదు. చీకటిగా ఉంటేనే గాఢ నిద్ర పడుతుంది. మనం నిద్ర నుంచి లేవకుండా చేస్తుంది. ఒకవేళ లేచినా గడియారం చూడకుండా నిద్రపోయేందుకు ప్రయత్నించాలి. ఎప్పుడు సెల్ ఫోన్ చూస్తూ ఉంటే కూడా నిద్ర సరిగా పట్టదు. నిద్ర లేకపోతే రోగాలు చుట్టుముడతాయి. దీంతో మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు దరిచేరతాయి. నిద్ర సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయమే తీసుకోవాలి. లేదంటే మనకు ఎన్నో ఉపద్రవాలు వస్తాయి. నిద్రలేమితో సమస్యల్లో పడుతుంటాం.

సంగీతం వినడం, పుస్తకాలు చదవడం వంటి పనులతో కూడా మనకు మంచి నిద్ర వస్తుంది. పడుకునే ముందు కూడా ఎలాంటి బెంగ పెట్టుకోకూడదు. ప్రశాంతంగా ఆలోచించాలి. అప్పుడే మంచి నిద్ర పడుతుంది. పగలు పడుకుంటే కూడా రాత్రి నిద్ర పట్టదు. పగటి పూట నిద్ర పనికి రాదు. అందుకే సాధ్యమైనంత వరకు పగటి పూట పవలించకూడదు. గదిలో లైట్లు వేసుకుని పడుకుంటే కూడా నిద్ర పట్టదు. మొత్తం చీకటిగా ఉంటేనే కళ్లు ప్రశాంతంగా మూసుకుని గాఢమైన నిద్ర మన సొంతమవుతుంది.