https://oktelugu.com/

Vomtings: లేచిన వెంటనే వాంతులు అవుతున్నాయా.. అయితే మీరు డేంజర్‌లో పడినట్లే!

ఉదయం పూట ఏం తినకుండా కూడా ఎందుకు వాంతులు వస్తాయి. అసలు దీనికి గల కారణాలేంటి? ఇలా డైలీ కావడం ఆరోగ్యానికి మంచిది కాదా? దీనివల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలేంటో మరి చూద్దాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 16, 2024 7:25 pm
Vomtings

Vomtings

Follow us on

Vomtings: కొందరికి ఉదయం లేచిన వెంటనే కాస్త చిరాకుగా, మత్తుగా ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల ఇలా మత్తుగా ఉందని అనుకుంటారు. కానీ ఆరోగ్యం సరిగ్గా లేక ఇలా జరుగుతుంది. అయితే ఉదయాన్నే లేచిన వెంటనే అస్వస్థతకు గురి కావడం, బాడీలో ఏదో తెలియని ఫీలింగ్, వాంతులు, అజీర్ణం, కడుపు నొప్పి, నీరసం, అలసట ఇలా ఒకటేంటి అన్ని కూడా ఉంటాయి. తీసుకునే ఆహారం జీర్ణం కాకపోవడం వల్లే ఇది జరుగుతుందని అనుకుంటారు. అయితే ఉదయం పూట ఆరోగ్యం సహకరించకపోవడం, వాంతులు ఇవన్నీ కేవలం తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల మాత్రమే కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట ఇలా వాంతులు, చిరాకుగా ఉంటే అసలు రోజంతా యాక్టివ్‌గా ఉండలేరు. ఏ పనిని కూడా సక్రమంగా చేయలేరు. దీనివల్ల ఇంకా ఆరోగ్యం పాడవుతుంది. కానీ మెరుగుపడదు. అసలు ఉదయం పూట ఏం తినకుండా కూడా ఎందుకు వాంతులు వస్తాయి. అసలు దీనికి గల కారణాలేంటి? ఇలా డైలీ కావడం ఆరోగ్యానికి మంచిది కాదా? దీనివల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలేంటో మరి చూద్దాం.

 

కొందరికి ఖాళీ కడుపుతో ఉండటం వల్ల వాంతులు వస్తాయి. ఎందుకంటే బ్రష్ చేసిన తర్వాత ఆకలి వేస్తుంది. కానీ తినకపోవడం వల్ల కడుపు నొప్పిగా అనిపించి.. వాంతులు అవుతాయి. కొందరు ఎక్కువగా ఆందోళన, ఒత్తిడికి గురవుతారు. దీర్ఘకాలికంగా గతంలో జరిగిన విషయాలని గుర్తించుకుని బాధపడుతుంటారు. దీనివల్ల కూడా వికారం, వాంతులు ఉదయం పూట వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరికి రక్తపోటు తక్కువగా ఉంటుంది. దీనివల్ల వారికి నీరసం అనిపించి ఉదయం పూట వాంతులకు కారణం అవుతుంది. కాబట్టి నిద్రలేచని తర్వాత ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకుండా ఏదైన ఆరోగ్యానికి మేలు చేసే పదార్థం తినడం మంచిది. కొందరు మైగ్రేన్ సమస్యతో బాధపడుతుంటారు. ఇది ఎప్పుడు వస్తుందో సరిగ్గా తెలియదు. అకస్మాత్తుగా తలనొప్పి ఎక్కువగా వస్తుంది. దీని వల్ల కూడా వాంతులు, వికారం ఉదయం పూట కనిపిస్తాయి. అయితే కొందరు ఉదయం పూట తినకపోవడం వల్ల మైగ్రేన్ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేయకూడదని నిపుణులు అంటున్నారు.

 

పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం, వాటర్ తక్కువగా తాగడం వల్ల బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనివల్ల కూడా వాంతులు అవుతాయని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి నీరు చాలా మంచివి. రోజుకి సరిపడా నీరు తప్పకుండా తాగాలి. వీటితో పాటు మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలు తప్పకుండా తీసుకుంటే బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. దీనివల్ల వాంతులు వంటివి రాకుండా ఉంటాయి. అయితే ఈ వాంతులు ఏదో ఒక రోజు వస్తే పర్లేదు. కానీ డైలీ లేచిన వెంటనే ఇలానే జరుగుందంటే.. తప్పకుండా వైద్యుని సంప్రదించాలి. ఇలా లేచిన వెంటనే వాంతులు, వికారం ఉన్నట్లయితే అది పచ్చకామెర్లకి దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరి. అలాగే ఉదయం పూట పచ్చి కూరగాయల జ్యూస్ తీసుకోవద్దు. వీటిని తీసుకోవడం వల్ల కూడా కొందరికి వాంతులు అవుతుంటాయి. కాబట్టి డాక్టర్‌ను సంప్రదించిన తర్వాత సూచనల మేరకు మాత్రమే మీరు కొన్ని ఆహారాలు తీసుకోవడం ఉత్తమం.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.