SwitchOff: మారుతున్న కాలానికి తగినట్లుగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. దీంతో ప్రపంచం అంతా డిజిటల్ మయంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కంప్యూటర్లు, లాప్ టాప్స్, మొబైల్ ఫోన్ల వంటివి ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నాయి. రోజుకో ఫీచర్ తో వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వాడకం కూడా విపరీతంగా పెరిగింది.
స్మార్ట్ ఫోన్ల వాడకం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. చాలా కంపెనీలు అత్యాధునిక ఫీచర్లతో మొబైల్స్ ను రూపొందిస్తుండటంతో మార్కెట్ లోకి కొత్త కొత్త ఫోన్లు వస్తున్నాయి. అన్ని విధాలుగా సౌకర్యాలను కల్పిస్తూనే అనేక రకాల వ్యాధులను కూడా ఇస్తోందని చెప్పుకోవచ్చు. గంటల కొద్దీ మొబైల్ ఫోన్ వాడటం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఇటీవల చిన్న పిల్లలు కూడా ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. వారి ఏడుపును కంట్రోల్ చేసేందుకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లను అలవాటు చేస్తున్నారు. అలాగే పెద్దవారు సైతం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఫోన్ లేకుండా ఒక్క క్షణం గడపలేకపోతున్నారు. అయితే దీని వలన ఎన్నో అనర్థాలు కలిగే అవకాశం ఉంది.
చిన్న వారి నుంచి పెద్దవారి వరకు అందరూ ఫోన్లను విరివిగా వినియోగిస్తున్నారు. దీంతో ప్రధానంగా మానవ సంబంధాలు సైతం దెబ్బతింటున్నాయి. ఇటీవల సైబర్ మీడియా నిర్వహించిన రీసెర్చ్ లో ఈ విషయం వెల్లడి అయిందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఫోన్ వాడకంతో కలిగే అనర్థాల గురించి తెలిపేందుకు వివో కంపెనీ #SwitchOff పేరిట ఓ క్యాంపెయిన్ చేపట్టింది. ఈ మేరకు ఈనెల 20వ తేదీన తమ కస్టమర్లు అందరూ రాత్రి 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు (సుమారు గంట సేపు) మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయాలని పిలుపునిచ్చింది. ఆ గంట సమయం పాటు ప్రతి ఒక్కరూ కుటుంబంతో గడపాలని సూచించింది. స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని తగ్గించాలని, దీని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తుంది.
మీరు కూడా స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తూ ఫ్యామిలీని దూరం పెడుతున్నారా? అయితే ఆ అలవాటును మార్చుకోండి.. ఫోన్ వాడకాన్ని తగ్గించడంతో పాటు కుటుంబంతో సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించండి.