Vitamin D: తింటే ఆయాసం, లేకుంటే నీరసం.. మనలో చాలామందిలో కనిపించే ఆరోగ్య పరిస్థితి ఇది.. మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు సంపూర్ణంగా శరీరానికి సద్వినియోగం కాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు.. శరీరానికి పోషకాలు అందించి ఎముకలను బలోపేతం చేసేది విటమిన్ డీ.. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్లు, విటమిన్లు చాలా అవసరం.. విటమిన్ల విషయానికి వస్తే ఆరోగ్యాన్ని పరి రక్షించడంలో “విటమిన్ డీ” చాలా కీలకం.. సంపూర్ణ ఆరోగ్యానికి, వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడంలో విటమిన్ డి ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే విటమిన్ డి ఎక్కువైనా కష్టమే.. తక్కువ ఉన్న కష్టమే. విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకున్నప్పటికీ ఆరోగ్యకరమైన వ్యక్తి రక్తంలో విటమిన్ డి స్థాయిలు అధికం అవడం అంటూ ఉండదు.

మనం తినే ఆహారం నుంచి కాల్షియన్ని గ్రహించేందుకు విటమిన్ డి సహాయపడుతుంది.. విటమిన్ డి పోషించే అత్యంత కీలక పాత్ర ఇది. విటమిన్ డి అధికంగా ఉంటే అది రక్తంలో క్యాల్షియం ఎక్కువగా ఉండేలా చేస్తుంది.. విటమిన్ డి అధికంగా ఉంటే అది హైపర్కాల్సె మియా కు దారి తీస్తుంది..హైపర్కాల్సె మియా అంటే రక్తంలో క్యాల్షియం స్థాయిలు ఎక్కువగా ఉండటం. విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల తలెత్తే హైపర్కాల్సె మియా ఉన్న వ్యక్తులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.. గందరగోళం , నిరాశ, సైకోసిస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.. మరీ తీవ్రమైన సందర్భంలో కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. శరీరంలో విటమిన్ డి అధికంగా ఉంటే అది మూత్రపిండాల సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.. దీనివల్ల క్యాల్షియం స్థాయి పెరుగుతుంది.. తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
హైపర్కాల్సె మియా
ఇది మూత్రపిండాల రక్తనాళాలు కుంచించుకుపోయేలా చేస్తుంది.. ఈ మూత్రపిండాల పని తీరు మందగించేందుకు దారితీస్తుంది.. విటమిన్ డి లోపం వల్ల మూత్రపిండాల సమస్యలు తలెత్తుతాయి.. ఇక విటమిన్ డి ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం వంటి ఖనిజాల శోషణ ను పెంచుతుంది. విటమిన్ డి సహజ సిద్ధంగా సూర్యరశ్మి నుంచి లభించే వనరుగా మనందరికీ తెలుసు.. విటమిన్ డి లోపం కూడా మనల్ని అత్యంత తరచుగా అనారోగ్యానికి గురి చేస్తూ ఉంటుంది.. ఈ విటమిన్ ఆరోగ్యకర వ్యాధి నిరోధక వ్యవస్థకు బాధ్యత వహిస్తుంది.. ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ అంటువ్యాధులతో పోరాడే కణాలను శరీరంలో ఉత్పత్తి చేస్తుంది. జలుబు లేదా ఫ్లూ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టయితే మీ విటమిన్ డి స్థాయిలను ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

విటమిన్ డి లోపం కారణంగా తరచూ ఒత్తిడికి దేహం గురవుతుంది.. ఇలాంటి సమయంలో సూర్యకాంతిలో ఉంటే మానసిక స్థితి మెరుగుపడుతుంది.. ఇది శరీరంలో సెరటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది.. దేహానికి కూడా సంతోషం కలుగుతుంది.. అంతే కాదు విటమిన్ డి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.. మనదేశంలో చాలామందిలో విటమిన్ డి స్థాయి బాగుంది కనుకే కోవిడ్ సమయంలో దానిని ఎదుర్కొన్నారు. చైనా లో మెజారిటీ ప్రజల్లో విటమిన్ డి లేకపోవడం వల్లే ఇప్పుడు నరకం చూస్తున్నారు.