Vitamin B12 Foods: శరీరానికి ఎన్నో విటమిన్లు, ప్రోటీన్లు అవసరం. వీటి కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే ప్రోటీన్, విటమిన్ రిచ్ ఫుడ్ మన డైలీ లైఫ్ లో తినే ఆహారంలోనే పుష్కలంగా లభిస్తాయి. అయితే ఈ రోజు విటమిన్ బీ 12 ఎందులో ఎక్కువగా లభిస్తుందో తెలుసుకుందాం.. శరీరంలో విటమిన్ బీ12 లోపం ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ విటమిన్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. విటమిన్ బీ 12(Vitamin B12) అధికంగా ఉండే 5 రకాల ఫుడ్స్ ను మీకోసం ఈ ఆర్టికల్ లో తెలిపాము. మరి అవేంటో తెలుసుకొని తినేసేయండి..
ట్యూనా, సార్డైన్, సాల్మన్ లాంటి చేపల్లో విటమిన్ బీ 12 పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే ఈ విటమిన్ శరీరానికి అందుతుంది. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పాలలోనూ విటమిన్ బీ 12 ఉంటుంది. అందుకే ఈ విటమిన్ లోపం ఉన్నవారు ప్రతిరోజు పాలు తాగడం చాలా ముఖ్యం. పాల వల్ల కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
కోడిగుడ్లలో విటమిన్ బీ 12, విటమిన్ డీ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు చాలా పోషకాలు ఉంటాయి. గుడ్లు తింటే మీ ఆరోగ్యానికి చాలా రకాలుగా ప్రయోజనం ఉంటుంది. అందుకే ప్రతి రోజు ఒక గుడ్డును మీ డైట్ లో భాగం చేసుకోండి. యోగర్ట్, చీజ్, లాంటి డెయిరీ ఉత్పత్తుల్లోనూ విటమిన్ బీ12 పుష్కలంగా ఉంటుంది.
చికెన్ బ్రెస్ట్ లో విటమిన్ బీ 12, లీన్ ప్రోటీన్, పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఇది తింటే చాలా లాభాలు దక్కుతాయి. అందుకే పైన తెలిపిన పదార్థాలను కచ్చితంగా మీ డైట్ లో భాగం చేసుకోండి. టున, సార్డైన్, సాల్మన్ చేపలు, పాలు, గుడ్లు, చీజ్ వంటివాటిని తినడం వల్ల బీ 12 పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోండి. ఆరోగ్యంగా జీవించండి.