https://oktelugu.com/

Virgin pregnancy : వర్జిన్ ప్రెగ్నెన్సీ.. కన్యత్వాన్ని కోల్పోకుండా గర్భం దాల్చే ఈ పద్ధతి లో ఏం చేస్తారంటే?

ఈ టెక్నిక్ వల్ల మలేషియా మహిళ రెండుసార్లు గర్భం దాల్చిందట. రెండు సందర్భాల్లోనూ ఆమె ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చిందట. మహిళలు ఫోర్ ప్లే లేదా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్) ద్వారా కూడా గర్భవతి అవచ్చు

Written By:
  • NARESH
  • , Updated On : August 17, 2024 / 10:29 PM IST

    Virgin pregnancy

    Follow us on

    Virgin pregnancy : వర్జిన్ ప్రెగ్నెన్సీ.. ఈ పదం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. రీసెంట్ గా వెలుగులోకి వస్తున్న ఈ విషయం మీద ఆసక్తి చూపిస్తున్నారు నెటజన్లు. అయితే వర్జిన్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి? ఇందులో శృంగారంతో పిల్లలు పుడుతారా? లేదంటే ఎలా పిల్లలు పుడుతారు అనే వివరాలు తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా చదివేసేయండి.

    అయితే ఈ వర్జిన్ ప్రెగ్నెన్సీలో ఒక మహిళ శృంగారంలో పాల్గొనకుండానే గర్భవతి అవుతుంది. అయితే ఇది ఎలా సాధ్యం అని కూడా చాలా మందికి అనుమానం ఉంది. నిజానికి స్త్రీ, పురుషుల కలయిక తర్వాతే ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అలా కలవకుండానే పిల్లలను కనవచ్చు అని ప్రస్తుత టెక్నాలజీ నిరూపిస్తుంది. ఇక ఈ విధానం క్లిష్టమైనది అస్సలు కాదంటున్నారు నిపుణులు. ఈ వర్జిన్ ప్రెగ్నెన్సీ చాలా సింపుల్.. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఇలా పిల్లలను పొందాలి అనుకుంటారు. ఒక నివేదిక ప్రకారం 7870 మంది మహిళలపై ఒక అధ్యయనం చేయగా కేవలం 0.5 శాతం మంది మహిళలు మాత్రమే వర్జిన్ ప్రెగ్నెన్సీతో పిల్లలను కనాలి అనుకున్నారట.

    ఈ టెక్నిక్ వల్ల మలేషియా మహిళ రెండుసార్లు గర్భం దాల్చిందట. రెండు సందర్భాల్లోనూ ఆమె ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చిందట. మహిళలు ఫోర్ ప్లే లేదా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్) ద్వారా కూడా గర్భవతి అవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ షాకింగ్ నిజాన్ని వెలుగులోకి తెచ్చింది రీసెంట్ అధ్యయనం. యు.ఎస్. లో తల్లులుగా మారిన 200 మంది మహిళల్లో ఒకరు ఈ పద్ధతిని అవలంబిస్తున్నారట. ఏకంగా స్త్రీ కన్యత్వాన్ని కోల్పోకుండా గర్భం దాల్చి ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తున్నారు.

    2021లో ఇంగ్లాండ్ కు చెందిన నికోల్ మూర్ అనే మహిళ ఈ టెక్నిక్ వల్లనే తల్లి అయింది. ప్రజలు ఆమెకు వర్జిన్ మేరీ అని పేరు కూడా పెట్టారట. మూర్ సంభోగం లేకుండానే ఐవీఎఫ్ తో ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది అంటున్నారు వైద్యులు. అయితే ఈ ఫోర్ ప్లే సమయంలో నికోల్ తన భాగస్వామితో శృంగారం చేయకుండానే గర్భం దాల్చింది. అయితే అండం ఉత్పత్తి అయ్యే సమయంలో శృంగారం చేస్తే గర్భం సంభవిస్తుందనేది తెలిసిందే. ఋతుస్రావం తర్వాత 14 రోజుల తర్వాత అండం ఉత్పత్తి అవుతుంది. ఇలాంటి సమయంలోనే అండాశయం గుడ్డు కణాలను విడుదల చేస్తుందట. వర్జిన్ ప్రెగ్నెన్సీ లో భాగంగా అండం విడుదలయ్యే సమయంలో.. స్పెర్మ్ కణాలతో కూడిన ద్రవం ఆడవారి ప్రైవేట్ భాగాలలోకి పంపిస్తే.. స్పెర్మ్ కణాలు మరియు గుడ్డు కణాలు కలిసిపోతాయి.

    ఈ ప్రాసెస్ తరువాత స్పెర్మ్ గుడ్డు కణాన్ని ఫలదీకరణం చేయడం వల్ల ఏకకణ జీవిని ఏర్పడుతుంది. జైగోట్‌లో తల్లి, తండ్రి నుంచి సగం DNA ఉంటుంది. దీన్ని ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భాశయంలోకి చొప్పిస్తారు. దీని తరువాత జైగోట్ పిండంగా మారే వరకు విస్తరిస్తూనే ఉంటుందట. ఈ పిండం పూర్తి అభివృద్ధికి సుమారు 40 రోజులు పడుతుందట. ఇక ఈ విషయం మీద ఆరోగ్య నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ పద్ధతి మంచిది అంటుంటే.. కొందరు మాత్రం భవిష్యత్తులో కొత్త ఇబ్బందులు వస్తాయి అంటున్నారు.