
Virat Uncle: వామిక.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ–అనుష్కశర్మ దంపతుల గారాల పట్టి. ఈఏడాది జనవరిలో వీరికి పాప జన్మించింది. ఆమెకు దంతుల పేర్లలో అక్షరాలు కలిసేలా వామిక అని పేరు పెట్టారు. అయితే సోమవారం బెంగళూరులో జరిగిన ఆర్బీసీ, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ నాలుగేళ్ల బుడతడు పట్టుకున్న ప్లకార్డు అందరి దృష్టిని ఆకర్షించింది. విరాట్ ఫ్యాన్ అయిన బుడ్డోడు ‘విరాట్ అంకుల్.. వామికను డేటికి తీసుకెళ్లొచ్చా?’ అని రాసిఉన్న ప్లకార్డు పట్టుకున్నాడు. దీంతో స్టేడియంలోని కెమెరాల దృష్టి మొత్తం ఒక్కసారిగా ఆ బుడ్డోడివైపు మళ్లాయి. అయితే ఇది బాబు వెంట వచ్చిన వారు రాసిచ్చిందని అర్థమవుతుంది. సరదాగా ఉన్న కామెంట్ చూసి అందరూ నవ్వుకున్నారు. కొంతమంది నెటిజన్లు్ల పిల్లలకు ఇలాంటివి నేర్పిస్తున్నారా? అని విమర్శిస్తున్నారు.
వామిక రాకతో సంబురం..
కోహ్లీ–అనుష్క దంపతులకు కూతురు పుట్టడంతో ఆ దంపతులు పట్టరాని ఆనందంలో ఉన్నారు. తల్లిదండ్రులుగా కూతురు ఆటపాటలను ఆస్వాదిస్తున్నారు. కూతురు పుట్టగానే.. ‘మేము పరస్పరం ఒకరిపై మరొకరం ప్రేమగా, కృతజ్ఞతతో కలిసి జీవించాము. ఈ చిన్నది, వామికా మా ప్రేమను సరికొత్త స్థాయికి తీసుకువెళ్ళింది. కన్నీళ్లు, నవ్వు, ఆందోళన, ఆనందం – కొన్ని నిమిషాల వ్యవధిలో అనుభవించిన భావోద్వేగాలు’ అని ట్వీట్ చేసింది అనుష్క శర్మ

కోహ్లీ భావోద్వేగం..
కూతురు రాకతో కోహ్లీ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా(అనుష్క శర్మ, నా) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందంటూ ట్వీట్ చేశాడు కోహ్లీ. ‘మాకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మాపై చూపిన ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకుగానూ ధన్యవాదాలు. ప్రస్తుతం పాప, అనుష్క ఆరోగ్యంగా ఉన్నారని’ తన పోస్టులో వెల్లడించాడు.