Viral Relationship News: కట్టుకున్న భార్యకు కలకాలం తోడు ఉండాలనేది అతడి సిద్ధాంతం. ఆమె కంట్లో కన్నీరు కనిపించకుండా సాకాలనేది అతడి లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే చూసుకున్నాడు. ఆమెకు నచ్చినట్టుగా నడుచుకున్నాడు. ఆమె కోరినవన్నీ కష్టమైనప్పటికీ కాళ్ళ ముందు ఉంచాడు. కళ్ళ ముందు అందమైన జీవితాన్ని ఆవిష్కరించడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. భర్త చూపిస్తున్న ఆ ప్రేమను మరింత పెంచుకోవడానికి.. అతడి మనసులో స్థానం మరింత సృష్టినం చేసుకోవడానికి ప్రయత్నించాల్సిన ఆమె దారి తప్పింది.. ఏ ఇల్లాలు చేయకూడని తప్పు చేసింది.. తప్పు చేసిన తన భార్యను మొదటి సారి క్షమించాడు. ఆ తర్వాత రెండోసారి కూడా ఆమె అదే తప్పు చేసింది.. దీంతో అతడు కీలక నిర్ణయం తీసుకున్నాడు.
అస్సాం రాష్ట్రానికి చెందిన మాణిక్ అలీ స్థానికంగా చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతడికి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లయింది. పెళ్లైన మొదట్లో వారి సంసారం బాగానే ఉంది. ఎప్పుడైతే ఆమె భార్య మనసులోకి ఇంకొక వ్యక్తి ప్రవేశించాడో.. అప్పటినుంచి వారి సంసారంలో విభేదాలు మొదలయ్యాయి. అతడిని భార్య దూరం పెట్టడం మొదలు పెట్టింది. అదే కాదు అతని పక్కన పెట్టి వేరే వ్యక్తితో పారిపోయింది. అప్పటికి అలీకి ఆమె ద్వారా ఒక కూతురు కలిగింది. కూతురు కోసం భార్య ఎంత తప్పు చేసినా అతడు క్షమించాడు.. చివరికి పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. భార్య తప్పును క్షమించి తన జీవితంలోకి ఆహ్వానించాడు. కలిసి ఉండడానికి ప్రయత్నించాడు.. అయినప్పటికీ ఆమె తన తీరు మార్చుకోలేదు. పైగా తన ప్రియుడితో సంబంధం కొనసాగించడం మొదలుపెట్టింది. అతనితో మాట్లాడటం.. ఇతర వ్యవహారాలు కొనసాగించడం మానుకోలేకపోయింది. ఈ విషయం మాణిక్ కు ఇబ్బంది కలిగించింది. ఈ వ్యవహార శైలి మానుకోవాలని అతడు హెచ్చరించినప్పటికీ ఆమె తన ధోరణి మార్చుకోలేదు.
ఇదే విషయాన్ని మళ్లీ ఆమె కుటుంబ సభ్యులతో మాణిక్ చెప్పాడు. కుటుంబ సభ్యులు కూడా ఆమెను హెచ్చరించారు.. పద్ధతిగా ఉండాలని సూచించారు. అయినప్పటికీ ఆమె అదే పద్ధతిలోనే వెళ్ళింది. చివరికి తన ప్రియుడితో మళ్ళీ ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో అతడు తట్టుకోలేకపోయాడు. బంధువులు చులకనగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాడు. కొద్దిరోజులపాటు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తన భార్య చేస్తున్న తప్పులను తట్టుకోలేక.. పరువు పోతుంటే భరించలేక కోర్టుకు వెళ్ళాడు.. విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. అనేక విచారణ తర్వాత అతడు సమర్పించిన ఆధారాలను కోర్టు పరిశీలనకు తీసుకుంది. ఆ తర్వాత ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది. కోర్టు విడాకులు మంజూరు చేసిన తర్వాత మాణిక్ సంబరాలు చేసుకున్నాడు. ఏకంగా 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు..” కుటుంబ సభ్యులు చేసిన సంబంధాన్ని చేసుకున్నాను. అమ్మాయికి అందమైన జీవితాన్ని ఇవ్వాలని భావించాను. మొదట్లో ఆమె నాతో బాగుంది. మా ఇద్దరి ప్రేమకు గుర్తుగా ఒక పాప జన్మించింది. ఆ తర్వాత ఆమెమనసు పూర్తిగా మారిపోయింది. మరొక వ్యక్తితో ఆమె వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు చెబితే మళ్ళీ ఆమెను నా జీవితంలోకి ఆహ్వానించాను. కానీ మరలా ఆమె అదే తప్పు చేసింది. ఈసారి తట్టుకోవడం నా వల్ల కాలేదు. అందువల్లే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాను. నా బాధను మన్నించిన న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. మనశ్శాంతిగా ఉంది. కొత్త జన్మను పొందినట్టు ఉందని” మాణిక్ పేర్కొన్నాడు.
In a bizarre and headline-grabbing incident from Mukalmua, Assam, a young man has become the center of attention after celebrating his divorce in an unconventional manner.
Manik Ali, a 32-year-old hotel owner from Borliyapar, made waves locally by bathing in 40 litres of milk… pic.twitter.com/IQceidQRla
— India Today NE (@IndiaTodayNE) July 12, 2025