Vastu Tips: మనం వాస్తుకు ప్రాధాన్యం ఇస్తుంటాం. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తాం. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే వాస్తు మీదే ఆధారపడి ఉంటుంది. ఇంట్లో నిత్యం చికాకులు, గొడవలు, పగలు, ప్రతీకారాలు లేకుండా ఉండాలంటే వాస్తు ప్రకారం చర్యలు తీసుకుంటే మంచిదే. లేకపోతే మనకు ఇబ్బందులు తప్పవు. ఇల్లును పక్కా వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకుని నిర్మిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో మానసిక ప్రశాంతత చేకూరాలంటే కూడా వాస్తుదే ప్రధాన పాత్ర అనే విషయం మనకు తెలుసు.

ఎప్పుడు కూడా ఇంట్లో పగిలిన, విరిగిన వస్తువులు ఉంచుకోకూడదు. అలా చేస్తే వాస్తు ప్రకారం ఇబ్బందులు వస్తాయి. వాస్తు నిపుణులు కూడా ఇదే విషయం చెబుతుంటారు. కొందరు పగిలిన అద్దాలను కూడా వాడుతూ ఉంటారు. పాడైపోయిన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. కిటికీల గ్లాస్, ఫర్నిచర్ ఏదైనా పగిలిపోయినప్పుడు తీసేయడమే శ్రేయస్కరం. విరిగిన వస్తువులు ఇంట్లో ఉంచుకోవడం వల్ల చెడు ప్రభావాలు వస్తాయి. శని దాపురిస్తుంది.
మనం చేసే చిన్న పొరపాట్లే పెద్ద ప్రమాదాల్ని తీసుకొస్తాయి. ప్రశాంతతను పాడు చేస్తాయి. ఈశాన్య దిశలో ఎరుపు రంగు వస్తువులు అసలు ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే ప్రతికూల ప్రభావాలే ఎదురవుతాయి. చెత్త డబ్బాలు, పాత వార్తా పత్రికలను కూడా ఇటు వైపు ఉంచితే నష్టాలే కలుగుతాయి. ఇంట్లో సానుకూలత రావాలంటే ఈశాన్యంలో ఓంకారం లేదా స్వస్తిక్ గుర్తు గోడపై ముద్రించుకోవడం చాలా మంచిది. పడక గది పశ్చిమ వాయువ్య దిశలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఇంట్లో అశాంతి కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిశలో మొక్కలు ఉంటే మనకు మంచి జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు.

వాస్తుకు అంతటి విలువ ఉంటుంది. ఇల్లు కట్టుకునేటప్పుడే అన్ని విషయాలు కరెక్టుగా చూసుకోవాలి. లేదంటే తరువాత మళ్లీ చేయాలంటే ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో గృహ వాస్తును పాటించి ఇల్లు బాగుండేలా ప్లాన్ చేసుకోవాలి. ఏ దిక్కులో ఏది ఉంచుకోవాలో మొదలే నిర్ణయించుకుని మంచి పద్ధతులు పాటించాలి. ఇలా చేయడం వల్ల వాస్తు రీత్యా ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలి. వాస్తుకు ప్రాధాన్యం ఇచ్చి ఎలాంటి బాధలు లేకుండా జీవితాన్ని గడిపేందుకు మార్గాలు చూసుకోవాలి.