https://oktelugu.com/

Vastu Tips : ఇల్లు ఎలా ఉండాలి? బెడ్ రూమ్ ఎక్కడ ఉండాలో తెలుసా?

ఈ దిశలో కిటికీలు, తలుపులు ఉంటే మంచిది కాదు.ఉన్నా కూడా తెరవకూడదు. ఇంట్లో పెద్ద గదిని ఈ దిక్కున తయారు చేసుకోవచ్చు. క్యాష్ కౌంటర్లు, యంత్రాలు ఉంచవచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : January 23, 2024 9:48 pm
    Follow us on

    Vastu Tips : అందమైన ఇల్లు ఉండటం ఎంత ముఖ్యమో.. ఆ ఇల్లు వాస్తు ప్రకారం ఉండటం కూడా అంతే ముఖ్యం అంటారు జ్యోతిష్యులు. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. లేదంటే ఇంట్లో అల్లర్లు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఇంట్లో చికాకులు వంటివి కూడా సంభవిస్తాయనే టాక్ ఉంది. అయితే ప్రస్తుతం వాస్తు ప్రకారం తలుపులు, బాత్ రూమ్, బెడ్ రూమ్ లు ఎక్కడ ఉండాలో తెలుసా? ఇంట్లోని గదులు, హాలు, వంటగది, బాత్రూమ్, పడకగది ఒక నిర్దిష్ట దిశలో ఉండాలి. దీని వల్ల ఇంట్లో వాస్తు దోషం ఉండదు. అందువల్ల ప్రజలు సంతోషంగా ఉంటారని నమ్ముతారు కొందరు.

    ఉత్తర దశ: ఈ దిక్కున ఎక్కువగా కిటికీలు ఉంటే మంచిది. ఇంటి బాల్కనీ, వాష్ బేషన్ కూడా ఈ దిక్కున ఉంటే మరింత మంచిది. కానీ ప్రధాన ద్వారం ఈ దిక్కున ఉండడం వల్ల చాలా మంచిది అంటున్నారు పండితులు.

    తూర్పు దిశ: తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు. అంటే సానుకూల శక్తివంతమైన కిరణాలు ఈ దిశలో నుంచి ఇంటిలోకి ప్రవేశిస్తాయి. అందుకే ఇంటి మెయిన్ డోర్ ఈ దిక్కున ఉండాలి. కావాలంటే విండోన్ అయినా ఉంచాలి.

    దక్షిణ దిశ: దక్షిణ దిశలో ఎలాంటి బహిరంగ స్థలం, మరుగుదొడ్డి ఉండకూడదు. ఇంట్లో ఏమైనా బరువైన వస్తువులు ఉంటే ఈ దిక్కున పెట్టండి. ఈ దిశలో తలుపులు కిటికీలు ఉండకూడదు. ఉంచితే ఇంట్లో ఆక్సిజన్ స్థాయి కూడా తగ్గిపోతుంది.

    పశ్చిమ దిశ: మీ వంటగది లేదా టాయిలెట్ ఈ దిశలో ఉండాలి. కానీ వంటగది, టాయిలెట్ లు ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండకూడదు.

    ఈ శాన్య దిశ: ఈ దిక్కు నీటి ప్రదేశం. నీటి బోరు, స్విమ్మింగ్ పూల్, ప్రార్థనా స్థలం మొదలైనవి ఉండాలి.

    వాయువ్య దిశ: మీ ఇంట్లో పడకగది, గ్యారేజ్, గోశాల వంటివి ఈ దిశలో ఉండాలి. ఇది అగ్ని సూత్రం. కాబట్టి గ్యాస్, బాయిలర్, ట్రాన్స్ ఫార్మర్ మొదలైనవి ఈ దిశలో ఉండాలట.

    నైరుతి దిశ: ఈ దిశలో కిటికీలు, తలుపులు ఉంటే మంచిది కాదు.ఉన్నా కూడా తెరవకూడదు. ఇంట్లో పెద్ద గదిని ఈ దిక్కున తయారు చేసుకోవచ్చు. క్యాష్ కౌంటర్లు, యంత్రాలు ఉంచవచ్చు.

    గమనిక: ఈ కథనం ప్రజల నమ్మకాల ఆధారంగా, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం మాత్రమే. దీనిని ఒకే తెలుగు ధృవీకరించలేదు. ఈ విషయం ఖచ్చితమైనది అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు కూడా లేవు.