Vastu Tips Sunset: మనం వాస్తుకు పక్కా ప్రాధాన్యం ఇస్తుంటాం. ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండాలంటే వాస్తు పద్ధతులు పాటించాల్సిందే. ఏదైనా వాస్తు ప్రకారం ఉండకుంటే కష్టాలు వస్తాయి. ఈ నేపథ్యంలో వాస్తు నియమాలు పాటిస్తూ ఇంటికి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం. కానీ కొన్ని విషయాలు మాత్రం పట్టించుకోం. దీంతో వాటితోనే మనకు నష్టాలు వస్తుంటాయి. సూర్యాస్తమయం సమయంలో కొన్ని పనులు పొరపాటున కూడా చేయొద్దు.
ప్రతి ఇంటిలో తులసి చెట్టు ఉంటుంది. దాన్ని పవిత్రంగా చూసుకుంటాం. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తులసిని భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటాం. సూర్యాస్తమయం సమయంలో తులసి చెట్టును తాకరాదు. ఆకులను తెంచకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. దీంతో మన ఇంటికి ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి.
సూర్యాస్తమయం తరువాత చీపురును తాకొద్దు. లక్ష్మీదేవి ఆ సమయంలోనే మన ఇంట్లోకి వస్తుంది. అందుకే చీపురును చీకటి పడ్డాక పట్టుకుంటే దరిద్రమే తాండవిస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియక సూర్యాస్తమయం సమయంలో కూడా చీపురు పట్టుకుని ఊడుస్తూ ఉంటారు. సూర్యాస్తమయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి.
సూర్యాస్తమయం తరువాత దానధర్మాలు చేయడం కూడా మంచిది కాదు. ఈ సమయంలో పాలు, పెరుగు ఎవరికి ఇవ్వకూడదు. వీటిని చంద్రుడికి ప్రతీకగా చెబుతుంటారు అందుకే సంధ్యా సమయంలో తెల్లని వస్తువులు ఇవ్వడం సముచితం కాదు. ఒకవేళ అలా చేస్తే మనశ్శాంతి లోపిస్తుంది. ఉల్లి, వెల్లుల్లిని కూడా ఈ సమయంలో దానంగా ఇవ్వవద్దు.
సూర్యాస్తమయం తరువాత అప్పులు ఇవ్వడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సమయంలో ఉప్పును కూడా దానంగా ఇవ్వొద్దు. ఇలా చేస్తే మనం సమస్యల్లో ఇరుక్కుంటాం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం సమయంలో ఎలాంటి దానాలు చేయకుండా ఉండటమే శ్రేయస్కరం.
సాయంత్రం సమయంలో చెత్త బయట వేయకూడదు. ఇలా చేస్తే కూడా మనకు ప్రతికూలతలు వస్తాయి. ఇంట్లో చెత్తను ఉదయం పూట బయట పడేయాలి. సాయంత్రం సమయంలో చెత్తను బయట పడేయకుండా ఓ చోట పెట్టుకోవాలి. సాయంకాలం ఇంటికి వచ్చిన అతిథిని వట్టిచేతులతో బయటకు పంపకూడదు. వారి చేతికి ఏదో ఒకటి చేతిలో పెట్టి పంపాలి.
సూర్యాస్తమయం తరువాత గోళ్లు కత్తిరించుకోవద్దు. షేవింగ్ చేసుకోవద్దు. కటింగ్ వంటి వాటి జోలికి వెళ్లకూడదు. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు రావడం సహజం. ఈ సమయంలో సంభోగంలో కూడా పాల్గొనకూడదు. ఒకవేళ అలా చేస్తే వారికి పుట్టే పిల్లలు బుద్ధిహీనులుగా ఉండే ప్రమాదం ఉంటుంది. అందుకే సాయంత్రం వేళ ఏ పనులు చేయకుండా ఉండటమే మంచిది.