Kitchen Vastu Tips: సాధారణంగా చాలామంది వారి కుటుంబ విషయంలో ఎన్నో రకాల వాస్తు నియమాలను పాటిస్తారు.ఈ విధమైనటువంటి వాస్తు నియమాలను పాటించడం వల్ల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తవు.

అందుకోసమే వాస్తు నియమాలను పాటించడం వల్ల వారి కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుందని భావిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను పొరపాటున కూడా వంటగదిలో పెట్టకూడదని పండితులు చెబుతుంటారు. మరి ఆ నాలుగు రకాల వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే..

వంటగదిలో కొంతమంది పింగాణి వస్తువులను ఉపయోగిస్తారు. ఈ విధంగా పింగాణి వస్తువులను ఉపయోగించేవారు పొరపాటున అవి పగిలిపోతే ఆ పగిలిపోయిన ముక్కలను వంటగదిలో ఉంచకూడదు.
చాలా మంది మహిళలు వంట గదిలో ఒక చిన్న డబ్బాలో మందులు, బ్యాండేజ్ క్లాత్ వంటి వాటిని దాచి పెడతారు.ఇలా వంట గదిలో ఇలాంటి మందులు ఉన్నప్పుడు ఇంటిల్లిపాది అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే ఇలాంటి వస్తువులను వంటగదిలో పెట్టకూడదు.
ఇక మన ఇంట్లో అద్దం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అద్దం మన ఇంటి పై ఎన్నో అనుకూల పరిస్థితులను ప్రతికూల పరిస్థితులను కలుగజేస్తుంది కనుక ఈ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా కిచెన్ లో అద్దం ఉండకూడదు. ఇలా అద్దం ఉండటంవల్ల ఎంతో అసౌకర్యంగా ఉంటుంది.
ప్రస్తుత కాలంలో చాలామంది ఆహార నియమాలను పాటిస్తూ అన్నం బదులు చపాతీ తింటారు. ప్రతిసారీ చపాతి పిండి కలపడం దేనికని భావించి ఒకేసారి కొంత ఎక్కువ మొత్తంలో పిండి కలిపి పిండిని ఫ్రిజ్ లో పెడతారు. ఇలా ఫ్రిజ్లో పిండి పెట్టడం వల్ల వాస్తు పరంగా ఆరోగ్య పరంగాను మంచిది కాదని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.