Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కార్తీక్ వాళ్ళు ఇంట్లో నుండి వెళ్లిపోవడంతో.. కార్తీక్ మాటలను తలుచుకుంటూ బాధపడుతుంది. అప్పుడే శ్రావ్య వచ్చి దీప గురించి బాగా ఎమోషనల్ అవుతుంది. ఏ రోజు కూడా దీపక్క సంతోషంగా లేదని బాధపడుతుంది. ఇక దీప, పిల్లలు ఇంటి బయట శుభ్రం చేసుకొని ఇంట్లో కి వెళ్తారు. కార్తీక్ కూడా ఇంట్లోకి వెళ్లడంతో కార్తీక్ ఇబ్బంది పడటంతో దీప నచ్చచెపుతుంది.

పిల్లలు ఆ వాతావరణంను, ఆ దుమ్మును చూసి ఇక్కడికి వచ్చాము ఏంటి అని ప్రశ్నిస్తారు. కార్తీక్ స్పందించకపోయేసరికి హిమ.. డాడీ మళ్లీ అబద్ధాలు చెబుతున్నాడు అంటూ అనడంతో దీప హిమ పై అరుస్తుంది. ఇక కార్తీక్ బాధపడుతూ అక్కడినుంచి వెళ్ళిపోతుండగా.. దీప బాధపడుతూ పిల్లలపై అరుస్తుంది. పిల్లలు మళ్లీ ఎటువంటి ప్రశ్నలు వేయము అంటూ.. డాడీని మరోసారి ఇబ్బంది పెట్టము అని సారీ చెబుతారు.
ఇక ఆదిత్య శ్రావ్య దగ్గరికి వచ్చి చిరాకు పడుతూ ఉంటాడు. ఏం జరిగింది అని అడగటంతో బయటకు వెళితే చాలు ప్రతి ఒక్కరు అన్నయ్య గురించి తమ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ బాధ పడతాడు. ఎన్నో పెద్ద సమస్యలు వచ్చినప్పుడు అందరం కలిసి ఎదుర్కున్నామని.. ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తించాడని అనేసరికి శ్రావ్య కూడా బాధపడుతూ మాట్లాడుతుంది. ఇకపై మోనిత మరింత రెచ్చిపోతోందని, ఇంట్లోకి వచ్చి సెటిల్ అయిపోతుందని అనుకుంటారు.
Also Read: ఈ ఏడాది వివాహ బంధంలో అడుగుపెట్టిన సినీ ప్రముఖులు వీళ్లే..
దీప తాను ఉండాలి అనుకుంటున్నా ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్తుంది. ఇక ఆమె ఎవరంటే ఆ ఊర్లో తనకు ఎంతో పలుకుబడి ఉండటమే కాకుండా, తనను చూసి ఆ ఊరి జనాలంతా భయపడతారు. దాంతో ఆమె దగ్గరికి దీప వెళ్లి మీ ఇంట్లో అద్దెకు ఉంటామని అడుగుతుంది. వెంటనే రుద్రాణి కాదనకుండా అద్దెకు ఇస్తుంది. మొత్తానికి రుద్రాణి మనసును గెల్చుకుంది మన వంటలక్క. ఇక ఆ ఇంట్లో వంటలక్క జీవితం ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” అప్డేట్… ఫుల్ జోష్ లో డార్లింగ్ అభిమానులు