Valaentines Day : పెళ్లికాకుండా అమ్మాయి, అబ్బాయి ఒకే గదిలో ఉండొచ్చా?

కాలం మారుతున్న కొద్దీ పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్ఛఇస్తున్నారు. దీంతో పెళ్లి కాకముందు ఒకరినొకరు అర్థం చేసుకున్న తరువాత ఆ తరువాత పెళ్లి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు మరింత చనువు తీసుకొని ఒకే గదిలో...

Written By: Srinivas, Updated On : February 6, 2024 2:46 pm

love couples

Follow us on

Valaentines Day :భారతీయ వివాహ వ్యవస్థ ప్రత్యేకమైనది. పురాతన కాలం నుంచి పెళ్లి విషయంలో కొన్ని కట్టుబాట్లను ఏర్పరుచుకొని వాటిని ఫాలో అవుతున్నారు. సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్న తరువాతే ఒక అమ్మాయి, అబ్బాయి భార్యభర్తలు అవుతారు. అంతకుముందు వారు కలుసుకోవడానికి వీలు లేదు. అయితే కాలం మారుతున్న కొద్దీ పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్ఛఇస్తున్నారు. దీంతో పెళ్లి కాకముందు ఒకరినొకరు అర్థం చేసుకున్న తరువాత ఆ తరువాత పెళ్లి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు మరింత చనువు తీసుకొని ఒకే గదిలో ఒక రోజంతా గడుపుతున్నారు. అయితే ఇది కొందరి దృష్టిలో తప్పుు కాకపోయినా భారతీయ వివాహ వ్యవస్థ ప్రకారం ఎవరూ ఒప్పుకోరు. అయితే చట్టం ప్రకారం ఇలా ఒకే గదిలో గడపొచ్చా?

నేటి కాలంలో పెళ్లిళ్లు మారాయి. పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయి అభిరుచులు తెలుసుకున్న తరువాతే ముందుకు వెళ్తున్నారు. అయితే కొదంరు డేటింగ్ పేరుతో సరదాగా గడుపుతున్నారు. ఈ సమయంలో వీకెండ్ డేస్, వాలంటైన్ డేస్ సందర్భంగా మరింత ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఇద్దరి ఇష్టంతో ఒకే గదిలో కపుల్స్ కలవడానికి చట్టం ఏం చెబుతోంది? అని చాలా మందికి సందేహం ఉంటుంది. కానీ చట్ట ప్రకారం ఇలా కలిసి ఉండడం తప్పేం కాదు. అయితే 18 సంవత్సరాలు నిండిన తరువాత ఇద్దరి ఇష్టాలతో ఒకే గదిలో కలిసి ఉండొచ్చు. అయితే కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చే వారు.. తమ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు ఏర్పడవచ్చు.

18 సంవత్సరాలు నిండిని యువతీ యువకుడు ఒకే గదిలో కలిసి ఉన్న సమయంలో ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడుతుంటే రక్షణ కోసం పోలీసులకు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయొచ్చు. అంతేకాకుండా కారణం లేకుండా ఇలాంటి వారిని ఎవరూ అడ్డుకునే హక్కు లేదని కొన్ని చట్టాలు చెబుతున్నాయి. అయితే సాంప్రదాయ విలువలు కాపాడాలనుకునేవారు మాత్రం ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిదని కొందరు నిపుణుల చెబుతున్నారు.

అంతేకాకుండా ఇలా కలిసి ఉండేవారు భద్రత ఉండే చోటును ఎంచుకోవడం మంచిదని అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ్యతిరేస్తారు. కపుల్స్ హాయిగా ఉండాలని కోరుకునే వారు సరైన ప్రదేశాన్ని ఎంచుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఇద్దరికి అనువుగా ఉండే ఆహ్లదమైన ప్రదేశాన్ని ఎంచుకోవడం ద్వారా ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుందని అంటున్నారు.