Vaginal cancer: ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్యాన్సర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. అయితే మహిళలకు ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, యోని క్యాన్సర్ వంటివి వస్తుంటాయి. ఏటా ఎందరో మహిళలు ఈ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది మహిళలు యోని క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతున్నారు. ఈ యోని క్యాన్సర్ మహిళలకు అరుదుగా వస్తుంది. యోనిలో క్యాన్సర్ కణాలు పెరగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది మహిళలు యోని క్యాన్సర్‌తో చాలా బాధపడుతున్నారు. అయితే ఈ క్యాన్సర్ చాలా ప్రమాదకరం. దీనిని గుర్తించడం చాలా కష్టం. సాధారణంగా అయిన యోని విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే యోని క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి యోని క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం.
యోని క్యాన్సర్ వచ్చిన విషయాన్ని గుర్తించడం చాలా కష్టం. మొదట్లో ఈ క్యాన్సర్ లక్షణాలు అసలు కనిపించవు. అయితే మహిళల శరీరంలో కొన్ని లక్షణాల ఆధారంగా యోని క్యాన్సర్‌ను గుర్తించాలి. యోనిలో ఒక కణితిలా గడ్డ ఏర్పడుతుంది. ఈ కణితి కొందరికి నొప్పిని కలిగిస్తే మరికొందరికి నొప్పిని కలిగించదు. ఇలా గడ్డలుగా కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఎందుకంటే గడ్డలన్నీ యోని క్యాన్సర్‌కి కారణం కాకపోవచ్చు. కానీ అందరిలో ఒకే లక్షణాలు ఉండవు. కొందరికి యోని ప్రదేశాల్లో రక్తస్రావం అవుతుంది. సాధారణంగా పీరియడ్స్, కలయికలో కాకుండా మిగతా సమయాల్లో అయితే మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే యోని నుంచి రక్తం రావడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి వెంటనే వైద్యుని సంప్రదించి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.
సాధారణంగా మహిళలకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఎక్కువగా పీరియడ్స్‌కి ముందు తర్వాత అయితే కొందరికి ఎక్కువగా అవుతుంది. రక్తంతో కలిసి తెల్ల బట్ట అయితే మాత్రం జాగ్రత్తపడాలి. యోని నుంచి దుర్వాసన వస్తూ.. రక్తంతో కలిసి తెల్లబట్ట అయితే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించాలి. కొందరికి మూత్ర విసర్జన సమయంలో నొప్పి ఉంటుంది. దీనిని మలబద్దకం అంటారు. ఈ సమస్య ఎక్కువ అయిన కూడా జాగ్రత్త పడాలి. ఇవన్నీ కూడా యోని క్యాన్సర్‌కు కారణం అవుతాయి. కలయికలో మహిళలకు యోని నొప్పి ఉంటుంది. కానీ ఏళ్ల తరబడి అధిక నొప్పి ఉంటే మాత్రం తప్పకుండా జాగ్రత్త పడాలి. కలయికలో తీవ్రంగా నొప్పి, రక్తం ఉంటే మాత్రం గైనకాలజిస్ట్‌ల సూచనలు తీసుకోవాలి. యోని క్యాన్సర్‌ను గుర్తించడం కష్టమైనప్పటికీ ఏ చిన్న లక్షణాలు కనిపించిన కూడా జాగ్రత్త పడాలి. ఈ క్యాన్సర్ చాలా ప్రమాదకరం. దీనివల్ల కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇందులో ఏ చిన్న లక్షణాలు కనిపించిన కూడా వెంటనే వైద్యుని సంప్రదించి సూచనలు తీసుకోవడం చాలా ఉత్తమం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.