https://oktelugu.com/

Tea: ఈ టీ లు తాగితే కోలెస్ట్రాల్ రమ్మన్నా.. రాదు..

ఉలాంగ్ టీ గురించి మన కంటే చైనీయులకు ఎక్కువగా తెలుసు. ఇందులో కొవ్వును కరిగించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణ టీ ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు ఉంటాయి. కానీ ఉలాంగ్ టీ లో లిపిడ్ ను తగ్గించే గుణాలు ఉంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : January 10, 2024 / 06:14 PM IST

    Tea

    Follow us on

    Tea: ఉదయం నుంచి రాత్రి వరకు హాయిగా ఉండడానికి కేవలం భోజనం చేయడమే కాదు. కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవాలి. చాలా మందికి నిద్రలేవగానే మంచి టీ తాగితే ఉత్సాహంగా ఉంటుంది. కానీ కొందరు మనసు పాడైపోయిన ప్రతీసారి టీ తాగుతూ ఉంటారు. రోజుకు రెండు సార్లు టీ తాగితే ఆరోగ్యం. అంతకంటే ఎక్కువగా తీసుకుంటే హానికరం. టీ ని ఎక్కువగా తాగడం వల్ల కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో టీ కి ప్రత్యామ్నాయ పానీయాలు తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ రమ్మాన్నా రాదని అంటున్నారు. మరి ఏ రకమైన టీ లు తీసుకోవాలి? వాటి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..

    ఉలాంగ్ టీ గురించి మన కంటే చైనీయులకు ఎక్కువగా తెలుసు. ఇందులో కొవ్వును కరిగించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణ టీ ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు ఉంటాయి. కానీ ఉలాంగ్ టీ లో లిపిడ్ ను తగ్గించే గుణాలు ఉంటాయి. దీంతో బరువు పెరగకుండా కాపాడుతుంది. లెమన్ టీ తాగడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. లెమన్ లో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని టీ తాగడం వల్ల యాంటీ యాక్సిడెంట్లు శరీరంలోకి వెళ్లి చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో లావు సమస్యలు దరిచేరవు.

    నేటి కాలంలో టీ కి ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ ని తీసుకుంటున్నారు. ఇది వివిధ రకాలుగా లభ్యమవుతుంది. గ్రీన్ తాగడం వల్ల శరీరం సమతుల్యంగా ఉంటుంది. అలాగే ఇందులో ఎలాంటి కెఫిన్ ఉండకపోవడంతో పాటు ఆహారాన్ని జీర్ణం చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో దీనిని తాగడం వల్ల లాభాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నవాళ్లు దీనిని తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

    అల్లం జీర్ణక్రియను పెంచుతుంది. అలాగే అల్లం టీ తాగడం వల్ల చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉండేలా చేస్తుంది. దీంతో రక్తప్రసరణ సక్రమంగా ఉండి ఎలాంటి కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీంతో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే అల్లం టీ ఇంట్లో చేసుకోవడం వీలు కాకపోతే బయట కూడా ఎక్కువగా లభిస్తోంది. కనీసం రెండు రోజులకోకసారి అల్లం టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.