https://oktelugu.com/

Urine: ఎక్కువ సమయం మూత్రం ఆపుకుంటున్నారా.. అమ్మో ఎంత ప్రమాదమో!

మూత్రం వచ్చిన వెంటనే వెళ్లాలి. లేకపోతే పెల్విక్ కండరాల మీద ఒత్తిడి పడుతుంది. మరి మూత్రాన్ని ఎక్కువ సమయం ఆపుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలియాలంటే ఆర్టికల్ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 24, 2024 / 04:23 AM IST

    urine

    Follow us on

    Urine: బయటకు వెళ్లినప్పుడు కొన్నిసార్లు మూత్రం వచ్చిన కూడా కొందరు వెళ్లరు. పబ్లిక్ టాయిలెట్లు బాలేవని, లేకపోతే ఫ్రీగా లేదని, పనిలో ఉండి కొందరు మూత్రాన్ని ఆపుకుంటారు. ఇలా మూత్రాన్ని ఆపితే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు మూత్రం ఆపడం వల్ల కలిగే ప్రమాదాలు చాలనే ఉన్నాయి. కొందరికి బద్ధకంగా అనిపిస్తే టాయిలెట్ వెళ్లడానికి కూడా లేవరు. మూత్రం వచ్చిన వెంటనే వెళ్లాలి. దాన్ని ఆపడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలిస్తే ఇంకోసారి మూత్రాన్ని ఆపరు. మూత్రాన్ని ఆపడం వల్ల ఆ ప్రదేశంలో బాగా ఒత్తిడి పడుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వంటివి కూడా వస్తాయి. ముఖ్యంగా యూరీనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు అయితే తప్పవు. వీటి బారిన పడితే ఇంకా అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్రం వచ్చిన వెంటనే వెళ్లాలి. లేకపోతే పెల్విక్ కండరాల మీద ఒత్తిడి పడుతుంది. మరి మూత్రాన్ని ఎక్కువ సమయం ఆపుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలియాలంటే ఆర్టికల్ మొత్తం చదివేయండి.

    కిడ్నీ రాళ్లు
    మూత్రం వచ్చిన వెంటనే వెళ్లాలి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపకుండా ఎక్కువ సమయం బాడీలో ఉంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా మూత్రం ఆపుకోవడం వల్ల కీడ్నీలో రాళ్లతో పాటు ఇన్ఫెక్షన్‌కి కూడా గురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య వస్తే మూత్రం వెళ్లేనప్పుడు తట్టుకోలేని నొప్పి వస్తుంది. ఈ సమస్య నుంచి మళ్లీ తగ్గాలంటే చాలా కష్టం. కొన్నిసార్లు ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది.

    మూత్రాశయం బలహీనంగా మారడం
    ఎక్కువ సమయం పాటు మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రాశయం సాగుతుంది. దీనివల్ల మూత్రాశయం బలహీనంగా మారుతుంది. దీంతో మీరు మళ్లీ మూత్రాన్ని ఆపుకోవడమే అలవాటు అవుతుంది. ఎప్పుడు మీకు మూత్రం వచ్చిన కూడా ఆపుకోవడానికే ట్రై చేస్తారు. అలాగే మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రాశయం బ్లాడర్ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మూత్రాన్ని ఆపుకోవద్దు.

    యూరినరీ ఇన్ఫెక్షన్లు
    మూత్రాన్ని ఎక్కువ సమయం ఆపుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడూ బయటకు పంపాలి. అంతే కానీ ఎక్కువ సమయం ఆపుకుంటే బ్యాక్టీరియా పేరుకుపోయి.. తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడితే ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం.

    డయాబెటిస్
    మూత్రాన్ని ఆపుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆపుకున్న ప్రతీసారి రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. ఎక్కువ సమయం మూత్రాన్ని ఆపుకోవడం వల్ల పెల్విక్ కండరాల్లో నొప్పి వస్తుంది. మీరు ఆపుకోవడం మొదలు పెట్టినప్పుడు భవిష్యత్తులో నొప్పిని భరిస్తారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.