Unknown Facts : నిజం నిప్పులాంటిది.. ప్రాణం పోయినా సరే అబద్ధం చెప్పొద్దు అని కొందరు పెద్దలు చెబతూ ఉంటారు. నిజం చెప్పినప్పుడు కష్టం కలగవచ్చు. కానీ ఆ తరువాత మనసు ప్రశాంతంగా మారుతుంది. అదే అబద్ధం చెప్పడం మొదలు పెడితే ఒకదానిని కప్పిపుచ్చడానికి మరో అబద్దం ఆడాల్సి వస్తుంది. ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. అయితే కొన్ని విషయాల్లో తమ గురించి చెప్పుకోవడానికి ఇతరులపై ప్రమాణం చేస్తుంటారు. మరికొందరు దేవుడిపై ప్రమాణం చేస్తున్నానని చెబుతూనే అబద్ధం ఆడుతారు. అయితే ఈ దేవుడిపై ఇలా అబద్ధపు ప్రమాణం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
భూమి మీద ఉన్న ప్రతీ వ్యక్తికి ఏదో రకమైన కష్టం ఉంటుంది. ఒక్కోసారి తన కష్టం నుంచి బయటపడడానికి తాత్కాలికంగా అబద్దం ఆడాల్సి వస్తుంది. చిన్న సమస్యలకు అబద్ధం ఆడితే పర్వాలేదు. కానీ పెద్ద విషయాల్లో అబద్ధంతో కప్పి పుచ్చాలని ప్రయత్నిస్తే ఆ తరువాత ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారని కొందరు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా దేవుళ్లపై ప్రమాణం చేసే ముందు జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. సాధారణ ప్రదేశాల్లో అబద్ధపు ప్రమాణం చేస్తే నష్టం తక్కువగా ఉండొచ్చు. కానీ ఈ వినాయకుడి ముందు అబద్దపు ప్రమాణం చేస్తే జీవితం కోలుకోదని కొందరు అంటున్నారు.
శుభకార్యాలు చేసేటప్పుడు, దేవుళ్లకు పూజలు నిర్వహించేటప్పుడు ముందుగా వినాయకుడి పూజ చేస్తారు. ఆది దేవుడిగా పిలిచే గణనాథుడు విఘ్నాలను తొలగిస్తాడు. వినాయకుడి అనుగ్రహం కలిగితే జీవితం సుఖమయంగా మారుతుంది. ఇదే సమయంలో తప్పులు చేస్తే మాత్రం అస్సలు విడిచిపెట్టరని కొందరు ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు. కొందరు తమ గొప్పలు చెప్పుకునే సమయంలో వినాయకుడి మందు అబద్ధపు ప్రమాణాలు చేస్తారు.
ముఖ్యంగా ఏపీలోని కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ముందు అబద్దపు ప్రమాణం చేస్తారు. ఇలా చేసిన వారు జీవితంలో అస్సలు కోలుకోలేదని, అ విషయం ప్రూవ్ అయిందని స్థానికులు చెబుతున్నారు. మిగతా దేవుళ్ల కంటే కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ముందు అబద్ధం చెప్పి ఎవరూ తప్పించుకోలేరని అంటున్నారు. కొన్ని ప్రముఖ విషయాల్లో వరసిద్ధి వినాయకుడి ముందు ప్రమాణం చేయిస్తారు. ఇలా చేసిన వారిని నమ్ముతారని చెబుతున్నారు.