https://oktelugu.com/

Turmeric: ఈ సమస్యలు ఉన్నాయా.. అయితే అసలు పసుపు జోలికి పోవద్దు!

కొందరికి తెలియక.. పసుపు ఆరోగ్యానికి మంచిదే అని ఏ సమస్య ఉన్న కూడా తినేస్తుంటారు. ఇలా తినడం వల్ల లేని పోని అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్యానికి మేలు చేసే పసుపు ఏయే సమస్యలు ఉన్నవారు తినకూడదో మరి తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 19, 2024 / 04:01 AM IST

    Turmeric

    Follow us on

    Turmeric: ప్రతీ ఒక్కరూ కూరల్లో తప్పనిసరిగా పసుపు వాడుతారు. ఆరోగ్యానికి పసుపు చాలా మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇది కేవలం ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు అందాన్ని పెంచడంలో కూడా సాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన కూడా పసుపును కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదట. పసుపులో ఉండే యాంటీ బయోటిక్ ఆరోగ్యానికి మంచిదని కొందరు ఎక్కువగా దీనిని వినియోగిస్తారు. ఇది అందరి ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు అసలు పసుపు జోలికి పోకూడదు. ఒకవేళ తిన్నారా.. ఇంకా ప్రమాదకరమైన వ్యాధులు బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరికి తెలియక.. పసుపు ఆరోగ్యానికి మంచిదే అని ఏ సమస్య ఉన్న కూడా తినేస్తుంటారు. ఇలా తినడం వల్ల లేని పోని అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్యానికి మేలు చేసే పసుపు ఏయే సమస్యలు ఉన్నవారు తినకూడదో మరి తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    మధుమేహంతో ఇబ్బంది పడుతున్నవారు
    ఈ రోజుల్లో చాలా మంది మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారు. షుగర్ ఉన్నవారు అసలు పసుపు తినకూడదట. ఎందుకంటే పసుపును తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మందికి తెలియక పసుపును తింటున్నారని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా షుగర్ ఉన్నవారు పసుపును కూరల్లో వాడకూడదట.

    కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు
    కొందరికి కిడ్నీలో రాళ్లు ఉంటాయి. అలాంటి వారు పసుపును కూరల్లో వాడకూడదు. ఇందులోని కర్కుమిన్ కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉందట. కిడ్నీ సమస్యలు ఉన్నవారు చాలా తక్కువగా మాత్రమే పసుపు తీసుకోవాలి. రోజుకు 50 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా మాత్రమే పసుపు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

    రక్తస్రావం బాగా అవుతున్నవారు
    పసుపులోని కర్కుమిన్ కొన్నిసార్లు రక్తస్రావానికి దారితీస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు ఎవరైనా కూడా పసుపును తీసుకోకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

    చర్మ సమస్యలు
    పసుపు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో బాగా సాయపడుతుంది. అయితే అలెర్జీ, ఇన్ఫెక్షన్ ఉన్నవారు పసుపును వాడకపోవడం బెటర్. ఇందులోని పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడిన కూడా అలెర్జీ ఉన్నవారికి సమస్యను పెంచుతాయట.

    క్యాన్సర్ సమస్య ఉన్నవారు
    క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులోని కర్కుమిన్ క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతుంది. తీసుకునే ఏ ఆహారంలో కూడా పసుపును చేర్చకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ఉన్నవారికి అనుకూల కంటే ప్రతికూల ప్రభావాలను తెచ్చిపెడుతుంది.

    జీర్ణకోశ సమస్యలు
    కడుపు నొప్పి, ఉబ్బరం, అతిసారం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారు పసుపును తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. ఇందులోని పోషకాలు సమస్యలను పెంచుతుంది. కానీ తగ్గించదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమస్యలు ఉన్నవారు పసుపును తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.