Tuberose Flower Benefits: ప్రతి ఇంటికి బెడ్ రూమ్ ప్రధానమైనదిగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి వచ్చి ఈ గదిలోనే విశ్రాంతి పొందుతారు. ఈ నేపథ్యంలో పడకగది ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఒక్కోసారి ఎంత నీటుగా సర్దుకున్న కూడా ఆ ఇంట్లోకి రాగానే ఏదో అలజడి ఉంటుంది. ఏవేవో సమస్యలు వస్తుంటాయి. అంతేకాకుండా కలత నిద్ర.. మానసికంగా ప్రశాంతత లేకపోవడం వంటివి జరుగుతాయి. అయితే ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచుకోవచ్చు. ఈ మొక్కలు స్వచ్ఛత అయిన వాతావరణాన్ని ఇవ్వడమే కాకుండా.. సువాసనను వెదజల్లుతాయి. అంతేకాకుండా ఇది ఇంట్లోని బెడ్ రూమ్లో ఉండడంవల్ల సిరి సంపదలు రావడం అని అంటున్నారు. ఇంతకీ ఆ మొక్క ఏదంటే?
ట్యూబ్ రోస్.. అనే పేరు చాలా తక్కువమంది విని ఉంటారు. ఈ మొక్కకు వచ్చే పుష్పాలు ఎంతో అందంగా ఉంటాయి. ఇవి సువాసనను వెదజల్లుతాయి. ట్యూబరోస్ మొక్కను రాణి గంధం అని కూడా అంటారు. దీనిని మొదట మెక్సికో లో కనుగొన్నారు. మనదేశంలో పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో దీనిని ఎక్కువగా సాగు చేస్తారు. ఈ పూలను ఎక్కువగా అలంకరణ కోసం ఉపయోగిస్తారు. అయితే దీనిని బెడ్రూంలో ఉంచుకోవడం వల్ల కూడా వాస్తు ప్రకారం గా ఎంతో అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.
ట్యూబరోస్ పూల వల్ల వ్యాపారం కూడా చేయవచ్చు. ఈ పూలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ పూలకు వచ్చే సువాసన ఎక్కువ కాలం ఉంటుంది. ఒక ఎకరం భూమిలో ఈ పూలను సాగు చేస్తే లక్ష రూపాయల నుంచి ఆరు లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. ఎక్కువగా పెర్ఫ్యూమ్ తయారీలో దీనిని ఉపయోగిస్తారు. అయితే దీనిని సాగు చేయాలంటే నీటి వసతి ఎక్కువగా ఉండాలి. అంతేకాకుండా ప్రత్యేకమైన వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారా అధిక దిగుబడిన పొందవచ్చు.
బయటి ప్రదేశాల్లో మాత్రమే కాకుండా ఇంటి పెరట్లో కూడా దీనిని పెంచుకోవచ్చు. ఇంటికి తూర్పు లేదా ఉత్తరం దిశలో టూబరోస్ మొక్కలు నాటితే జీవితంలో డబ్బుకు డోకా ఉండదు అని అంటున్నారు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంట్లో మనశ్శాంతి, ఆయురారోగ్యాలు ఉండాలంటే ఈ మొక్కను నాటుకోవాలని అంటున్నారు. దీనిని పడకగదిలో ఉంచుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది. ఇద్దరు ఎప్పటికీ సంతోషంగా ఉండగలుగుతారు. అందువల్ల సాధ్యమైనంతవరకు ట్యూబురోస్ మొక్కను బెడ్ రూమ్ లో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి.
ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఎప్పటికీ స్వచ్ఛమైన వాతావరణం ఉండి.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. తద్వారా మంచి ఆలోచనలు వచ్చి పిల్లలు సైతం ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలాగే కొత్త ఆలోచనలతో సంతోషంగా ఉండగలుగుతారు. అందువల్ల దగ్గర్లో కనిపిస్తే ఈ మొక్కను అస్సలు వదల వద్దని కొందరు వాస్తు నిపుణులు తెలుపుతున్నారు.